Apr 23,2023 07:35
  • ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి, 2 రన్స్‌ ఇచ్చిన అర్షదీప్‌ సింగ్‌

ఐపీఎల్‌ లో మరో రసవత్తరపోరు జరిగింది. భారీ స్కోర్ల మ్యాచ్‌ లో పంజాబ్‌ కింగ్స్‌ విజేతగా నిలిచింది. 215 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్‌ జట్టు 13 పరుగుల తేడాతో నెగ్గింది. ఆఖరి ఓవర్లో ముంబయి ఇండియన్స్‌ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఆఖరి ఓవర్‌ వేసిన లెఫ్టార్మ్‌ సీమర్‌ అర్షదీప్‌ సింగ్‌ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను పంజాబ్‌ను గెలిపించాడు. ఈ ఓవర్లో అర్షదీప్‌ రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయగా, రెండు పర్యాయాలు మిడిల్‌ స్టంప్‌ విరిగిపోయింది. తొలుత తిలక్‌ వర్మ (3)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన అర్షదీప్‌... ఆ తర్వాతి బంతికి నిహాల్‌ వధేరాను ఔట్‌చేశాడు.
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 44 పరుగులు చేయగా, కామెరాన్‌ గ్రీన్‌ 67 పరుగులు, సూర్యకుమార్‌ యాదవ్‌ 26 బంతుల్లో 57 పరుగులు చేశాడు. గ్రీన్‌, సూర్య అవుటయ్యాక పరిస్థితి మారిపోయింది. టిమ్‌ డేవిడ్‌ (25 నాటౌట్‌) క్రీజులో ఉన్నప్పటికీ, అర్షదీప్‌ సింగ్‌ ఆఖరి ఓవర్‌లో పరుగులు చేయలేక ముంబయి ఓటమి చెందింది. అర్షదీప్‌ సింగ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. నాథన్‌ ఎల్లిస్‌ 1, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ 1 వికెట్‌ తీశాడు.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: షార్ట్‌ (సి) చావ్లా (బి) గ్రీన్‌ 11బీ ప్రభ్‌సిమ్రన్‌ ఎల్బీ (బి) అర్జున్‌ 26బీ అథర్వ (బి) చావ్లా 29బీ లివింగ్‌స్టోన్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) చావ్లా 10బీ హర్‌ప్రీత్‌ సింగ్‌ (బి) గ్రీన్‌ 41బీ సామ్‌ కరన్‌ (సి) అండ్‌ (బి) ఆర్చర్‌ 55బీ జితేశ్‌ (బి) బెరెన్‌డార్ఫ్‌ 25బీ షారుక్‌ ఖాన్‌ నాటౌట్‌ 0బీ హర్‌ప్రీత్‌ బ్రార్‌ రనౌట్‌ 5బీ ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 214బీ వికెట్ల పతనం: 1-18, 2-65, 3-82, 4-83, 5-175, 6-197, 7-209, 8-204బీ బౌలింగ్‌: అర్జున్‌ 3-0-48-1బీ బెరెన్‌డార్ఫ్‌ 3-0-41-1బీ గ్రీన్‌ 4-0-41-2బీ ఆర్చర్‌ 4-0-42-1బీ చావ్లా 3-0-15-2బీ హతిక్‌ షోకీన్‌ 3-0-24-0

ముంబయి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) అండ్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 44బీ ఇషాన్‌ కిషన్‌ (సి) షార్ట్‌ (బి) అర్ష్‌దీప్‌ 1బీ గ్రీన్‌ (సి) కరన్‌ (బి) ఎలిస్‌ 67బీ సూర్యకుమార్‌ (సి) అథర్వ (బి) అర్ష్‌దీప్‌ 57బీ డేవిడ్‌ నాటౌట్‌ 25బీ తిలక్‌వర్మ (బి) అర్ష్‌దీప్‌ 3బీ నేహల్‌ వధెరా (బి) అర్ష్‌దీప్‌ 0బీ ఆర్చర్‌ నాటౌట్‌ 1బీ ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 201బీ వికెట్ల పతనం: 1-8, 2-84, 3-159, 4-182, 5-200, 6-200బీ బౌలింగ్‌: షార్ట్‌ 1-0-7-0బీ అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-29-4బీ హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2-0-15-0బీ సామ్‌ కరన్‌ 3-0-41-0బీ ఎలిస్‌ 4-0-44-1బీ రాహుల్‌ చాహర్‌ 4-0-42-0బీ లివింగ్‌స్టోన్‌ 2-0-23-1