జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటారు నటుడు సందీప్ కిషన్.. కథ ఎలా ఉన్నా కేవలం తన నటనతోనే ఎంగేజ్ చేసే సామర్థ్యం అతని ప్రత్యేకత. కెరీర్ ప్రారంభంలో నాని వంటి హీరోలతో సమానంగా రాణించిన సందీప్.. తర్వాత రేసులో కాస్త వెనుకపడ్డాడు. అయినా ప్రతి చిత్రానికీ వైవిధ్యంగా కనిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా 'మైఖేల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు..
సినిమాలు చేసిన మొదట్లోనే నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న హీరోల్లో సందీప్‌కిషన్ ఒకరు. ప్రస్థానం సినిమాలో సందీప్ చేసిన పాత్రకి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రొమాంటిక్ లవ్స్టోరీలాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్థానం చిత్రంతో వెండితెరకు పరిచయమైన సందీప్. 'స్నేహ గీతం', 'ఇట్స్ మై లవ్‌స్టోరీ', 'రొటీన్ లవ్‌స్టోరీ' వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత రకుల్ ప్రీత్‌సింగ్ సరసన నటించిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ రంగంలో ఆశించినంత విజయాలు లేకున్నప్పటికీ అందిన ప్రతి చిత్రంలోనూ తన నటనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా మైఖేల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
- ఇందులో నా పాత్ర చాలా వైల్డ్..
మైఖేల్ చాలా వైల్డ్. గ్యాంగ్ స్టర్ కాకపోయినా మైఖేల్ అనే పాత్ర అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఇంకోపక్క చాలా నెమ్మది కూడా ఉంటుంది. కానీ సమయం వచ్చినప్పుడు అగ్రెసివ్‌గా బిహేవ్ చేసే పాత్ర. అయితే ఇందులో జరిగిన చాలా సంఘటనలు నాకైతే జరగలేదు. కానీ నిజంగా జరిగితే ఎలా వుంటుందో ఊహించి, చేశాము. మైఖేల్‌కి ఫ్రండ్స్ ఉండరు. ఎవరితోనూ మాట్లాడడు. తను చేసే పనులన్నీ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటాయి. ఇలాంటి పాత్రలు ఎప్పుడూ చేయలేదు. ఇక ఈ సినిమా కథకి, విజువల్ నెరేటివ్‌కి పాన్ ఇండియా కెపాసిటీ ఉంది. విజువల్‌గా చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. యాక్షన్ చాలా ఫ్రెష్‌గా, రియలిస్టిక్ వైబ్‌తో ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని నమ్ముతున్నా.
- నటన అంటే ఇష్టం..
ఇంత మంది పెద్ద నటీనటులతో పనిచేయడం సవాల్‌గా అనిపించిందా? అన్న ప్రశ్నకు సమాధానంగా..'లేదండీ. నాకు నటన అంటే ఇష్టం. ఈ విషయంలో ఎప్పుడూ భయపడలేదు. పాత్రని, సన్నివేశాన్ని అర్థం చేసుకోవడంపైనే నా దృష్టి ఉంటుంది. కథలో మైఖేల్ పాత్రని కొట్టి, ఐదు రోజులు పాటు తిండీతిప్పలు లేకుండా ఎక్కడో పారేసుంటారు. ఆ సీన్ చేస్తున్నపుడు నిజంగానే వాటర్ తప్పితే ఏమీ తీసుకోలేదు. దాదాపు 18 రోజులు పాటు డైట్లో ఉన్నాను. ఒక దశలో కుడికాలు పనిచేయడం మానేసింది. అప్పుడు ఒక ఫైట్ షూట్ చేశాం. పొరపాటున కాలు రాంగ్గా ల్యాండ్ కావడంతో ఇంక ప్యాకప్ చెప్పాం. దీంతో పాటు షూటింగ్ కూడా చాలా డార్క్ ఏరియాల్లో చేశాం. గాజు పెంకులు గుచ్చుకునేవి. చాలా రోజుల తర్వాత నాతో చాలా పని చేయించుకున్న సినిమా ఇది. చాలా వర్క్ శాటిస్ఫాక్షన్ వుంది' అని బదులిచ్చారు.
- నేను చాలా ఎమోషనల్..
ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై ప్రశ్నించగా.. 'ప్రస్తుతానికి నేను ఎటువంటి రిలేషన్‌షిప్‌లోనూ లేను. అది నాకు సెట్ కాదు. నేను చాలా ఎమోషనల్. నా భాగస్వామి మీద ఎక్కువగా ఆధారపడతాను. అన్ని విషయాల్లో తన అభిప్రాయం తీసుకోవాలని అనుకుంటాను. ఎప్పుడూ తనతోనే మాట్లాడాలని, తనకే సమయం కేటాయించాలని భావిస్తాను. అంత ఈజీగా వదులుకోలేను. కాబట్టి.. నాలాంటి వ్యక్తికి రిలేషన్ చాలా డేంజర్. అందరిలాగానే గతంలో నాక్కూడా ప్రేమలో ఎదురుదెబ్బలు తగిలాయి. గతేడాది బ్రేకప్ దెబ్బ గట్టిగానే తగిలింది' అని సందీప్ వివరించారు. ఓ నటితో తాను రిలేషన్లో ఉన్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని వివరించారు. ఆమె తనకి మంచి స్నేహితురాలు మాత్రమేనని తెలిపారు. లాక్డౌన్ తర్వాత మనుషుల మనస్తత్వంలో ఎంతో మార్పు వచ్చిందని, ఇప్పుడున్న రోజుల్లో ఒక బంధాన్ని కాపాడుకోవడం కష్టమైన పని అని తెలిపారు.
- ఎంతో ఎక్సైట్మెంట్తో చేశా...
ఈ జర్నీని చాలా ఎంజారు చేశాను. బరువు తగ్గాను, స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను. అండర్ వాటర్‌లో షూట్ చేశాం.. ఇవన్నీ ఎక్సైటెడ్‌గా చేశాను. ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే అక్కడ కల్చర్, భాష నాకు తెలుసు. అందుకే విజరుసేథి మైఖేల్‌లో భాగమయ్యారు. ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో తీసుకున్నారు. దీంతోపాటు తమిళ ఆడియన్స్ నుంచి చాలా ప్రేమ లభించింది. అందుకే మైఖేల్ తమిళంలో కూడా షూట్ చేశాం. ఈ చిత్రానికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ప్రస్తుతానికి 'భైరవ కోన', 'బడ్డీ', 'కెప్టెన్ మిల్లర్' సినిమాలు చేస్తున్నా. ఈ మూడూ భిన్నమైన సినిమాలు. దీంతో పాటు 'ఫ్యామిలీ మ్యాన్ 3' ఉంది. అలాగే త్వరలోనే మరో ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాబోతుందని వివరించారు.
పేరు : సందీప్ కిషన్
పూర్తిపేరు : పాదమ్ సందీప్ కిషన్
పుట్టిన తేదీ : మే7, 1987
పుట్టిన ప్రాంతం : చెన్నరు
చదువు : గ్రాడ్యుయేషన్
తల్లిదండ్రులు : పిఆర్పి నాయుడు, ఆర్కె దుర్గ
తోబుట్టువులు : మౌనిక, అభినరు
హాబీస్ : ట్రావెలింగ్, పార్టీస్