Sep 19,2023 16:18

జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు బుధవారం నియోజకవర్గ కేంద్రం, బఅందావన్‌ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళా విజయవంతం చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్‌ మేళాలో సుమారు 80 కంపెనీలు పాల్గంటాయాని 13 వేల ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పదో తరగతి ఆపైన చదువుకున్న విద్యార్థులు, ఎలాంటి విద్యార్హతలు అవసరం లేకుండా కూడా కొన్ని జాబ్స్‌ కల్పిస్తున్నామని, సంబంధిత సర్టిఫికెట్లతో వచ్చి జాబ్‌ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.