రైతు భరోసా కేంద్రాన్ని-వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్
ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం మెట్టవలస పంచాయతీలో ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులతో రూ.21 లక్షలు వ్యయంతో నూతన రైతు భరోసా కేంద్రంను, రూ.17.50 లక్షలు వ్యయంతో డాక్టర్ వైస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ నూతన భవనాలను ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జి.సిగడాం మండల ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జడ్పీటీసీ కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షులు బూరాడ వెంకటరమణ, బూత్ కమిటీ కన్వీనర్ ఆబోతుల జగన్నాథం, జే.సి.యస్ మండల ఇంచార్జి డోల వెంకటరమణ, వైస్ ఎంపీపీతోలేటి వెంకటరావు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మక్కా వెంకటసాయి, బాతువ పిఎసిఎస్ చైర్మన్ ఎర్నేని ప్రకాష్, పల్లాడ సన్యాసిరావు, మెట్టవలస పంచాయతీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డకర రామకృష్ణ, డకర కృష్ణ, డకర సన్యాసిరావు, డకర సురేష్, మెట్టవలస వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జి.సిగడాం మండల ఎంపీడీఓ శ్రీనువాసరావు, పంచాయతీ రాజ్, డిఈ సీతంనాయుడు, హౌసింగ్ ఎఈ రమేష్, ఎంఈఒ రవి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఈ భాగ్యలక్ష్మి, అగ్రికల్చర్ ఎఓ శారద, ఎలక్ట్రికల్ ఎఈ తిరుపతిరావు, ఎపిఓ సత్యనారాయణ, ఏపీఎం రెడ్డి రామకృష్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి, జి.సిగడాం మండలం సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సచివాలయం కన్వీనర్లు, గృహ సారధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.










