May 21,2023 07:19
  • ప్లే ఆఫ్ చేరిన లక్నో
  • రింకూ పోరాటం వృథా..

ఈడెన్‌ గార్డెన్స్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ మధ్య ఆఖరి బంతి వరకు జరిగిన పోరులో రింకు సింగ్‌ పోరాటం వృథా అయ్యింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఒక్క పరుగు తేడాతో నెగ్గి, ప్లే ఆఫ్‌ దశలో మూడో బెర్తును కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ లో టాస్‌ ఓడి ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున నికోలస్‌ పూరన్‌ (58) అర్థ సెంచరీతో రాణించగా క్వింటన్‌ డికాక్‌ (28), ప్రేరక్‌ మన్కడ్‌ (26), అయుష్‌ బదోని (25) లు ఫర్వాలేదనిపించారు. అనంతరం లక్నో నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఫలితంగా లక్నో ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. కేకేఆర్‌ ఆటగాడు రింకూ సింగ్‌ (33 బంతుల్లో 67 నాటౌట్‌ , 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి బంతి వరకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

లక్నోఇన్నింగ్స్‌ : కరన్‌ (సి) శార్దూల్‌ (బి) హర్షిత్‌ 3బీ డికాక్‌ (సి) రసెల్‌ (బి) వరుణ్‌ 28బీ ప్రేరక్‌ (సి) హర్షిత్‌ (బి) అరోరా 26బీ స్టాయినిస్‌ (సి) వెంకటేశ్‌ (బి) అరోరా 0బీ కనాల్‌ (సి) రింకూ (బి) నరైన్‌ 9బీ బదోని (సి) శార్దూల్‌ (బి) నరైన్‌ 25బీ పూరన్‌ (సి) వెంకటేశ్‌ (బి) శార్దూల్‌ 58బీ గౌతమ్‌ నాటౌట్‌ 11బీ బిష్ణోరు (బి) శార్దూల్‌ 2బీ నవీనుల్‌ నాటౌట్‌ 2బీ ఎక్స్‌ట్రాలు 12
మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 176బీ
వికెట్ల పతనం: 1-14, 2-55, 3-55, 4-71, 5-73, 6-147, 7-159, 8-162బీ బౌలింగ్‌: హర్షిత్‌3-0-21-1బీ అరోరా 4-0-30-2బీ వరుణ్‌ 4-0-38-1బీ నితీష్‌ 1-0-3-0బీ శార్దూల్‌ 2-0-27-2బీ నరైన్‌ 4-0-28-2బీ సుయాశ్‌ 1-0-12-0బీ రసెల్‌ 1-0-12-0

కోల్‌కతా ఇన్నింగ్స్‌: జేసన్‌ (బి) కనాల్‌ 45బీ వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) బిష్ణోరు (బి) గౌతమ్‌ 24బీ నితీష్‌ (సి) కనాల్‌ (బి) బిష్ణోరు 8బీ గుర్బాజ్‌ (సి) బిష్ణోరు (బి) యశ్‌ 10బీ రింకూ నాటౌట్‌ 67బీ రసెల్‌ (బి) బిష్ణోరు 7బీ శార్దూల్‌ (సి) మన్కడ్‌ (బి) యశ్‌ 3బీ నరైన్‌ రనౌట్‌ 1బీ అరోరా నాటౌట్‌ 1బీ ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175బీ వికెట్ల పతనం: 1-61, 2-78, 3-82, 4-108, 5-120, 6-134, 7-136బీ
బౌలింగ్‌: మోసిన్‌ 1-0-15-0బీ నవీనుల్‌ 4-0-46-0బీ కనాల్‌ 4-0-30-1బీ గౌతమ్‌ 4-0-26-1బీ బిష్ణోరు 4-0-23-2బీ యశ్‌ 3-0-31-2