లక్నో: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచాడు. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 15.2 ఓవర్లలో 93 పరుగులు చేసిన దశలో భారీ వర్షం కురవడం మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభమైనా.. బెంగళూరు బ్యాటర్స్ పరుగులు రాబట్టేందుకు కష్టాలు పడాల్సి వచ్చింది. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేయగల్గింది. ఛేదనలో లక్నోకు ఆదినుంచే కష్టాలు మొదలయ్యాయి. పరుగుల ఖాతా తెరవకుండానే మయర్స్(0) పెవీలియన్‌కు చేరగా.. జట్టు స్కోర్ 27పరుగులకు చేరేసరికి టాపార్కర్ నలుగురు బ్యాటర్స్ ఔటయ్యారు. కృనాల్(14), స్టొయినీస్(13), గౌతమ్(23) రెండంకెల స్కోర్ చేశారు. ఈ క్రమంలో బెంగళూరు బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో జట్టు 66పరుగులకే చేరేసరికి 7వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయం చేసుకుంది. చివరి ఓవర్ వరకు పోరాడి 108పరుగులే చేసి పరాజయాన్ని చవిచూసింది. దీంతో బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. హేజిల్‌వుడ్, కరణ్ శర్మకు రెండేసి, సిరాజ్, మ్యాక్స్‌వెల్, హసరంగ, హర్షల్ పటేల్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు...
బెంగళూరు ఇన్నింగ్స్: విరాట్ కోహ్లి (స్టంప్)పూరన్ (బి)రవి బిష్ణోరు 31, డుప్లెసిస్ (సి)కృనాల్ పాండ్యా (బి)అమిత్ మిశ్రా 44, అనుజ్ రావత్ (సి)మయర్స్ (బి)గౌతమ్ 9, మ్యాక్స్‌వెల్ (ఎల్‌బి)రవి బిష్ణోరు 4, ప్రభుదేశారు (సి)గౌతమ్ (బి)అమిత్ మిశ్రా 6, దినేశ్ కార్తీక్ (రనౌట్) యశ్ ఠాకూర్ 16, లామ్రోర్ (ఎల్‌బి) నవీన్- ఉల్-హక్ 3, హసరంగ (నాటౌట్) 8, కరణ్ శర్మ (సి)గౌతమ్ (బి)నవీన్-ఉల్-హక్ 2, మహ్మద్ సిరాజ్ (సి)పూరన్ (బి)నవీన్-ఉల్-హక్ 0, హేజిల్‌వుడ్ (నాటౌట్) 1, అదనం 2. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 126పరుగులు. వికెట్ల పతనం: 1/62, 2/75, 3/80, 4/0, 5/109, 6/114, 7/117, 8/121, 9/121 బౌలింగ్: కృనాల్ 4-0-21-0 స్టొయినీస్ 1-0-11-0, నవీన్ 4-0-30-3, బిష్ణోరు 4-0-21-2, మిశ్రా 3-0-21-2, యశ్ ఠాకూర్ 2-0-12-0, కృష్ణప్ప గౌతమ్ 2-0-10-1.
లక్నో ఇన్నింగ్స్: మయర్స్ (సి)అనుజ్ రావత్ (బి)సిరాజ్ 0, బడోనీ (సి)కోహ్లి (బి)హేజిల్‌వుడ్ 4, కృనాల్ పాండ్యా (సి)కోహ్లి (బి)మ్యాక్స్‌వెల్ 14, దీపక్ హుడా (స్టంప్)దినేశ్ కార్తీక్ (బి)హసరంగ 1, స్టొయినీస్ (సి)ప్రభుదేశారు (బి)కరణ్ శర్మ 13, పూరన్ (సి)లామ్రోర్ (బి)కరణ్ శర్మ 9, కృష్ణప్ప గౌతమ్ (రనౌట్) సోను యాదవ్/కార్తీక్ 23, రవి బిష్ణోరు (రనౌట్) హర్షల్/కార్తీక్ 5, అమిత్ మిశ్రా (సి)కార్తీక్ (బి)హర్షల్ పటేల్ 19, నవీన్ (సి)కార్తీక్ (బి)హేజిల్‌వుడ్ 13, కేఎల్ రాహుల్ (నాటౌట్) 0, అదనం 7. (19.5ఓవర్లలో ఆలౌట్) 108 పరు గులు. వికెట్ల పతనం: 1/0, 2/19, 3/21, 4/27, 5/38, 6/65, 7/66, 8/77, 9/103, 10/108 బౌలింగ్: సిరాజ్ 3-0-24-1, హేజిల్‌వుడ్ 3-0-15-2, మ్యాక్స్‌వెల్ 1-0-3-1, హసరంగ 3-0-20-1, కరణ్ శర్మ 4-0-20-2, హర్షల్ పటేల్ 3.4-0-20-1, లామ్రోర్ 1-0-4-0.

- వర్షంతో బ్యాటర్లకు కష్టాలు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 126/9
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్‌జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) మ్యాచ్‌కు వర్షం వెంటాడింది. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. 15.2 ఓవర్లలో 93 పరుగులు చేసిన బెంగళూరు జట్టు వర్షం నిలిచాక పరుగులు రాబట్టేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. డుప్లెసిస్(44), కోహ్లి(31), దినేశ్ కార్తీక్(16) టాప్ స్కోరర్స్.
- వర్షంతో నిలిచిన ఆట
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుండగా.. సోమవారం లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ ఎంచుకోని 15.2 ఓవర్ల వద్ద వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ 40, దినేశ్ కార్తీక్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
కేఎల్ రాహుల్‌కు గాయం..

ఫీల్డింగ్ చేస్తున్న లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడ కండరాలు పట్టేయడంతో మైదానంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బౌండరీ వెళ్లే బంతిని ఆపేందుకు పరుగెడుతూ ఒక్కసారిగా నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో కెఎల్ రాహుల్‌ను మైదానం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు స్ట్రక్చర్‌ను తీసుకురాగా.. జట్టు ఫిజియో, ఇతర సిబ్బంది సాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లాడు.
టాప్-3లో అమిత్ మిశ్రా..

లక్నో సూపర్ జెయింట్స్ సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. సుయాశ్ ప్రభుదేశారు వికెట్ పడగొట్టడం ద్వారా మిశ్రా ఐపీఎల్ టాప్-3 బౌలర్ల జాబితాలోకి దూసుకొచ్చాడు. మూడో ప్లేస్‌కు ఎగబాకే క్రమంలో మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో డ్వేన్ బ్రావో (161మ్యాచ్‌ల్లో 183 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. యజ్ఞేంద్ర చాహల్ (140మ్యాచ్‌ల్లో 178) రెండో స్థానంలో, అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 171వికెట్లు) మూడో స్థానంలో ఉన్నారు. లక్నోతో మ్యాచ్‌కు ముందు 169 వికెట్లు కలిగిన మిశ్రా.. ఒక్క వికెట్‌తో శ్రీలంక లసిత్ మలింగ (122 మ్యాచ్‌ల్లో 170), ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (173 మ్యాచ్‌ల్లో 170), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (193 మ్యాచ్‌ల్లో 170)లను దాటేశాడు.
- వర్షం అంతరాయం
15.2 ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. డుప్లెసిస్ (40), కార్తీక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. జట్టు స్కోర్ 93/4.
- నాలుగో వికెట్ డౌన్
అమిత్ మిశ్రా బౌలింగ్‌లో సుయాశ్ ప్రభుదేశాయ్ (6) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 92/4. డుప్లెసిస్ (39), దినేశ్ కార్తీక్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
- మ్యాక్స్ వెల్ ఎల్బీ
రవి బిష్ణోయ్‌బౌలింగ్‌లో మ్యాక్స్ వెల్ ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. ఆర్‌సిబి 13 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 85 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులోకి సుయాష్ ప్రభుదేసాయి వచ్చాడు. డుప్లెసిస్ 31 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
K Gowtham with the second wicket for @LucknowIPL!
— IndianPremierLeague (@IPL) May 1, 2023
Anuj Rawat departs for 9 as Kyle Mayers takes the catch 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/uhdrjIbiGF
- అనుజ్ రావత్ ఔట్
11 బంతుల్లో 9 పరుగులు చేసిన అనుజ్ రావత్ కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి మ్యాక్స్ వెల్ వచ్చాడు. ఆర్‌సిబి ప్రస్తుతానికి 75 పరుగులు చేంది.
- 10 ఓవర్లు పూర్తి .. ఆర్‌సిబి 65/1
10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఆర్‌సిబి వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. డుప్లెసిస్ 27 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అనుజ్ రావత్ 3 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేశాడు. అంతకు మందు కోహ్లీ 31 ఔటయ్యాడు.
𝙏𝙞𝙢𝙚𝙡𝙮 𝙗𝙧𝙚𝙖𝙠𝙩𝙝𝙧𝙤𝙪𝙜𝙝 🔥
— JioCinema (@JioCinema) May 1, 2023
📹 how Ravi Bishnoi outfoxes Virat Kohli with a googly! 🥵#LSGvRCB #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @LucknowIPL pic.twitter.com/G3qNqGqoYz
- కోహ్లీ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (31) ఔటయ్యాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో కోహ్లీని వికెట్ కీపర్ పూరన్ స్టంప్ ఔట్ చేశాడు. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 62/1. డుప్లెసిస్ (29), అనుజ్ రావత్ క్రీజ్‌లో ఉన్నారు
పవర్ ప్లేలో 42
పవర్ ప్లేలో ఆర్‌సిబి 42 పరుగులు చేసింది. కోహ్లీ 19 బంతుల్లో 21 పరుగులు చేయగా, డుప్లెసిస్ 17 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మరో వైపు లక్నో బౌలర్లు వికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- 3 ఓవర్లు పూర్తి.. ఆర్‌సిబి 20/0
3 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆర్‌సిబి 20 పరుగులు చేసింది. డుప్లెసిస్ 11, విరాట్ 9 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు.
- టాస్ గెలిచిన ఆర్‌సిబి
ఐపీఎల్ 16వ సీజన్ 43వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సిబి కెప్టెన్ డుప్లెసిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. హేజల్‌వుడ్,అనుజ్ జట్టులోకి వచ్చారు. లోక్నో జట్టులో అవేశ్‌కాన్ స్థానంలో గౌతం జట్టులోకి వచ్చాడు.
🚨 Toss Update 🚨@RCBTweets win the toss and elect to bat first against @LucknowIPL.
— IndianPremierLeague (@IPL) May 1, 2023
Follow the match ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/6t6Bs18AH8
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(సి), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(సి), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), కృష్ణప్ప గౌతం, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్










