May 24,2023 19:35

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ 41, సూర్యకుమార్‌ యాదవ్‌ 33, తిలక్‌ వర్మ 26 పరుగులు చేయగా.. ఆఖర్లో నిహాల్‌ వదేరా 12 బంతుల్లో 23 పరుగులు చేయడంతో ముంబై 180 పరుగుల మార్క్‌ను దాటింది. రోహిత్‌ 11, ఇషాన్‌ 15 పరుగులు మరోసారి నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ నాలుగు వికెట్లు తీయగా.. యష్‌ ఠాకూర్‌ మూడు, మొసిన్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

  • క్రిస్‌ జోర్డాన్‌ ఔట్‌

మోషిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో క్రిస్‌ జోర్డాన్‌ ఔటయ్యాడు. ముంబాయి 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. క్రీజులోకి హృతిక్‌ షోకిన్‌ వచ్చాడు.

  • 18 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 162/6

18 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నిహాల్‌ వదేరా 9, క్రిస్‌ జోర్డాన్‌ 2 పరుగులతో ఆడుతున్నారు.

  • తిలక్‌ వర్మ ఔట్‌

నవీన్‌-ఉల్‌-హక్‌కు బౌలింగ్‌లో తిలక్‌ వర్మ దీపక్‌ హూడ్డాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి క్రిస్‌ జోర్డాన్‌ వచ్చాడు. ముంబాయి 159 పరుగులు చేసింది.

  • టీమ్‌ డేవిడ్‌ ఔట్‌

13 పరుగులు చేసిని టీమ్‌ డేవిడ్‌ యష్‌ ఠాకుర్‌ బౌలింగ్‌లో దీపక్‌ హూడ్డాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో తిలక్‌ వర్మ, నేహాల్‌ వదేరా ఉన్నారు.

  • 16 ఓవర్లుకు 141/4

16 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 141 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ 26, టిమ్‌ డేవిడ్‌ 9 పరుగులతో ఆడుతున్నారు.
 

  • 15 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 131/4

15 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ 18, టిమ్‌ డేవిడ్‌ 8 పరుగులతో ఆడుతున్నారు.

  • 14 ఓవర్లుకు.. ముంబై 126 /4

14 ఓవర్లు ముగిసే సరికి ముంబై 126 పరగులు చేసింది. క్రీజులో తిలక్‌ వర్మ 16, టీమ్‌ డేవిడ్‌ 5 పరుగులు చేశారు.

  • ఒకే ఓవర్‌లో 2 వికెట్లు

నవీన్‌-ఉల్‌-హక్‌కు ఒకే ఓవర్‌లో 2 వికెట్లు దక్కాయి. తొలుత సూర్యను క్యాచ్‌ ఔట్‌ చేసిన నవీన్‌, ఆ వెంటనే కామెరూన్‌ గ్రీన్‌ను కూడా క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు పంపాడు. గ్రీన్‌ 23 బంతుల్లో 43 పరగులు చేశాడు. క్రీజులోకి టీమ్‌ డేవిడ్‌ వచ్చాడు. ముంబై ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

  • సూర్య ఔట్‌.. ముంబై 104/3

నవీన్‌-ఉల్‌-హక్‌ బౌలింగ్‌లో సూర్య కృష్ణప్ప గౌతమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. సూర్య 20 బంతుల్లో 33 పరుగులు చేశాడు. క్రీజులోకి తిలక్‌వర్మ వచ్చాడు.

  • 10 ఓవర్లు పూర్తి.. ముంబై 98/2

10 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై 98 పరుగులు చేసింది. కామెరూన్‌ గ్రీన్‌ 22 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌ సాయంతో 42 పరుగులు, సూర్య 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 31 పరుగులు చేశాడు.

  • 7 ఓవర్లకు 70

7 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై 70 పరుగులు చేసింది. కామెరూన్‌ గ్రీన్‌ 15 బంతుల్లో 31, సూర్య 6 బంతుల్లో 10 పరుగులు చేశారు

 

  • పవర్‌ ప్లే పూర్తి 

పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి ముంబై 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. కామెరూన్‌ గ్రీన్‌ 23, సూర్యకుమార్‌ 9 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • ఇషాన్‌ ఔట్‌

యష్‌ ఠాకుర్‌ బౌలింగ్‌ ముంబై ఓపెనర్‌ ఇషాన్‌ కిషాన్‌ పూరాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవలియన్‌కు చేరాడు. ఇషాన్‌ 12 బంతుల్లో 15 పరుగులు చేశాడు.

  • రోహిత్‌ ఔట్‌

11 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ నవీన్‌-ఉల్‌-హక్‌ బౌలింగ్‌లో ఆయుష్‌ బదోనికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు. క్రీజులోకి గ్రీన్‌ వచ్చాడు.

  •  ఒవర్లు పూర్తి

2 ఒవర్లు పూర్తయ్యే సరికి మంబై 13 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషాన్‌ 13 పరుగులు చేయగా రోహిత్‌ శర్మ ఇంకా ఖాతా తేరవలేదు.

  • టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌.. తొలుత బ్యాటింగ్‌

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫైయర్‌లో గుజరాత్‌తో పోటీ పడాలని ఇరు జట్లు చూస్తోన్నాయి.

ముంబై ఇండియన్స్‌ (ప్లేయింగ్‌ 11): రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), కామెరూన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, టిమ్‌ డేవిడ్‌, నెహాల్‌ వధేరా, క్రిస్‌ జోర్డాన్‌, హృతిక్‌ షోకీన్‌, పీయూష్‌ చావ్లా, జాసన్‌ బెహ్రెండోర్ఫ్‌, ఆకాష్‌ మధ్వల్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ప్లేయింగ్‌ 11): క్వింటన్‌ డి కాక్‌(వికెట్‌ కీపర్‌), యష్‌ ఠాకూర్‌, ప్రేరక్‌ మన్కడ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, నికోలస్‌ పూరన్‌, కృనాల్‌ పాండ్యా(కెప్టెన్‌), ఆయుష్‌ బదోని, కృష్ణప్ప గౌతమ్‌, రవి బిష్ణోరు, నవీన్‌-ఉల్‌-హక్‌, మొసిన్‌ ఖాన్‌