May 16,2023 17:16

జైపూర్‌ : ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా నేడు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్‌ ఢ కొట్టనుంది. పాయింట్స్‌ పట్టికలో వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్న ముంబై, లక్నో జట్లు ప్లే ఆఫ్‌లో స్థానం కోసం హౌరా హౌరీ పోటీ పడనున్నాయి. ఇప్పటివరకు ముంబై ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 గెలుపొంది 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. అటు లక్నో జట్టు 12 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి.. ఒక టై మ్యాచ్‌తో 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది.

తుది జట్లు(అంచనా)
ముంబై ఇండియన్స్‌: 
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్‌ వర్మ టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా,, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండోర్ఫ్

లక్నో సూపర్‌ జెయింట్స్‌ : క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, యుధ్వీర్ చరక్‌,యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్