- ఇరుజట్లు చెరో పాయింట్
- బడోనీ అర్ధసెంచరీ
లక్నో: లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిచే సమయానికి లక్నో జట్టు 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125పరుగులు చేసింది. ఆయుష్ బదోని(59నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. కష్ణప్ప గౌతమ్(1) రహానెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగానే భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై చెన్నై స్పిన్నర్లు చెలరేగారు. కైల్ మేయర్స్(10)ని నాలుగో ఓవర్‌లో మొయిన్ అలీ ఔట్ చేయగా.. ఆరో ఓవర్‌లో తీక్షణ వరుస బంతుల్లో మనన్ వోహ్రా(10), కృనాల్ పాండ్యా(0)లను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్(6)ను జడేజా అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించగా.. కరన్ శర్మ(9) మొయిన్ అలీకి రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో లక్నో జట్టు 10 ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఆ తర్వాత నికోలస్ పూరన్, ఆయుష్ బడోని నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 15వ ఓవర్ నుంచి బడోని దూకుడు పెంచాడు. తీక్షణ వేసిన ఆ ఓవర్‌లో బడోని సిక్స్ బాదాడు. మ్యాచ్‌లో నమోదైన తొలి సిక్సర్ అదే. తీక్షణ వేసిన 17వ ఓవర్‌లో బడోని ఓ సిక్స్, ఫోర్ రాబట్టాడు. మరోవైపు, నెమ్మదిగా ఆడుతున్న నికోలస్ పూరన్.. పథీరణ వేసిన 18 ఓవర్‌లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి క్రీజ్‌ను విడిచాడు. దీపక్ చాహర్ వేసిన 19 ఓవర్‌లో బడోని మరింత రెచ్చిపోయాడు. వరసగా ఫోర్, సిక్స్ బాది 30బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్‌లో చివరి బంతిని కూడా నేరుగా బౌండరీ అవతలికి పంపి మొత్తం 20 పరుగులు రాబట్టాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ, పథీరణ, తీక్షణ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా ఒక వికెట్ తీశాడు.

స్కోర్‌బోర్డు...
లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: వోహ్రా (బి)తీక్షణ 10, మయర్స్ (సి)రాజపక్సె (బి)మొయిన్ 14, కరణ్ శర్మ (సి అండ్ బి)మొయిన్ 9, కృనాల్ పాండ్యా (సి)రహానే (బి)తీక్షణ 0, స్టొయినీస్ (బి)జడేజా 6, పూరన్ (సి)మొయిన్ (బి)పథీరణ 20, బడోనీ (నాటౌట్) 59, కృష్ణప్ప గౌతమ్ (సి)రహానే (బి)పథీరణ 1, అదనం 6. (19.2ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 125పరుగులు.
వికెట్ల పతనం: 1/18, 2/27, 3/27, 4/34, 5/44, 6/103, 7/125
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-41-0, దేశ్‌పాండే 1-0-1-0, మొయిన్ అలీ 4-0-13-2, తీక్షణ 4-0-37-2, జడేజా 3-0-11-1, పథీరణ 3.2-0-22-2.
.@JontyRhodes8 to the rescue 😃👌🏻
No shortage of assistance for the ground staff in Lucknow 😉#TATAIPL | #LSGvCSK pic.twitter.com/CGfT3dA94M
— IndianPremierLeague (@IPL) May 3, 2023
- గౌతం ఔట్
పతిరణ బౌలింగ్‌లో గౌతం(1) రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆటకి వర్షం అంతరాయం ఏర్పడటంతో ఆటను నిలిపివేశారు.
A cracking fifty from Ayush Badoni 🙌
He gets to his half-century in style with a maximum 🔥🔥
Follow the match ▶️ https://t.co/QwaagO40CB #TATAIPL | #LSGvCSK pic.twitter.com/lxk9zSMa5I
— IndianPremierLeague (@IPL) May 3, 2023
- బదోని అర్ధ శతకం
లక్నో యువ ఆటగాడు ఆయుష్ బదోని హాఫ్ సెంచరీతో మెరిశాడు. 18.3 ఓవర్లో చహర్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 50 పరుగుల మార్కు అందుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్న బదోని దాటిగా ఆడటంతో 19 ఓవర్లలో లక్నో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది
- పురాన్ ఔట్
20 పరుగులు చేసిన నికోలస్ పూరన్ మతీషా పతిరణ బౌలింగ్‌లో మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కృష్ణప్ప గౌతమ్ వచ్చాడు.
- 100 పరుగుల మార్క్‌ను అందుకన్న లక్నో
18 ఓవర్లు పూర్తయ్యే సరికి లక్నో 100 పరుగులు మార్క్‌ను దాటింది. 44 పరుగులకే 5 వికెట్లు కొల్పోయి కష్టల్లో ఉన్న జట్టును ఆయుష్ బదోని, పురాన్ ఆదుకున్నారు. నెమ్మదిగా ఆడుతూ.. మరో వికెట్ పోకుండా 100 పరుగుల మార్క్‌ను అందుకున్నారు. ప్రస్తుతానికి ఆయుష్ బదోని 38, పురాన్ 20 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు.
- 15ఓవర్లు పూర్తి.. బదోని 18, పురాన్ 16
15 ఓవర్లు పూర్తయ్యే సరికి లక్నో 73 పరుగులు చేసింది. ఆయుష్ బదోని 18, పురాన్ 16 పరుగులు చేశారు.
- 13 ఓవర్లు పూర్తి
13 ఓవర్లు పూర్తయ్యే సరికి లక్నో 57 పరుగులు చేసింది. ఆయుష్ బదోని 7, పురాన్ 11 పరుగులు చేశాడు. లక్నో ప్రస్తుతం 57/6 ఉంది.
- మరో వికెట్ డౌన్
9 పరుగులు చేసిన కరణ్ శర్మ మోయిన్ ఆలీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. లోక్నో ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులోకి ఆయుష్ బదోని వచ్చాడు. పురాన్ 10 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు.
𝗣.𝗘.𝗔.𝗖.𝗛!
That was an epic delivery from @imjadeja 🔥🔥
Follow the match ▶️ https://t.co/QwaagO40CB #TATAIPL | #LSGvCSK pic.twitter.com/dhPSVB4BuF
— IndianPremierLeague (@IPL) May 3, 2023
- స్టోయినిస్ ఔట్... లక్నో 34/4
3 వికెట్లు కోల్పోయి కష్టల్లో ఉన్న లక్నో మరో షాక్ తగిలింది. అల్‌రౌండర్ స్టోయినిస్ జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌అయ్యాడు. ప్రస్తుతం లక్నో 4 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజులో పురాన్, కరణ్ శర్మ ఉన్నారు.
- పవర్ ప్లే పూర్తి.. లక్నో 31/3
పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి లక్నో 3 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (14), మనన్ వోహ్రా (10), కృనాల్ పాండ్యా డక్‌ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు. క్రీజులో మార్కస్ స్టోయినిస్, కరణ్ శర్మ ఉన్నారు.
- కైల్ మేయర్స్ ఔట్
టాస్ ఒడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కైల్ మేయర్స్ మెయిన్ ఆలీ బౌలింగ్‌లో గైక్వాండ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి కరణ్‌శర్శ వచ్చాడు.
- టాస్ గెలిచిన సీఎస్‌కే
లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. కాగా ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరం కావడంతో కృనాల్ పాండ్యా లక్నో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. సిఎస్‌కే ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఆకాశ్ సింగ్ స్థానంలో చహర్ జట్టులోకి వస్తున్నాడు.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ : కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), కనాల్ పాండ్యా(కెప్టెన్), కష్ణప్ప గౌతమ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోరు, మొహ్సిన్ ఖాన్.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీ(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ










