Oct 08,2023 14:55

అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోందని టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నాసిరకం మధ్యం ద్వారా ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారని ఆరోపించారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''మద్యంతో దోపిడీ చేస్తూ 'జగనన్న సురక్ష' అంటూ ప్రజల వద్దకు వెళ్తారా? నాలుగేళ్లలో రూ.28వేల కోట్ల మేర జరిగిన మద్యం అమ్మకాలకు లెక్కల్లేవు. ఏపీ ఎక్సైజ్‌ లిక్కర్‌ సేల్స్‌ వెబ్‌సైట్‌ ఎందుకు మూసేశారు? రాష్ట్రంలో వెయ్యికోట్ల కుంభకోణం జరుగుతోంది. ఈడీ, సీబీఐలకు ఇది కనిపించదా?''అని సోమిరెడ్డి ప్రశ్నించారు.