Apr 29,2023 15:13

గుజరాత్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగుల స్కోరు చేసింది. టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. అయితే ఆట ప్రారంభం అయ్యే దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పాటు చినుకులు మొదలయ్యాయి. 45 నిమిషాలు ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. అనంతరం బ్యాటింగ్‌ మొదలెట్టిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్లు నారాయణ్‌ జగదీశన్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. 15 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసిన నారాయణ్‌ జగదీశన్‌, మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ 4 బంతులాడి డకౌట్‌ అయ్యాడు.. జోషువా లిటిల్‌ బౌలింగ్‌లో 14 బంతుల్లో 11 పరుగులు చేసిన వెంకటేశ్‌ అయ్యర్‌ అవుట్‌ అయ్యాడు. 3 బంతుల్లో ఓ ఫోర్‌ బాదిన కెప్టెన్‌ నితీశ్‌ రాణా కూడా జోషువా లిటిల్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు. వికెట్లు పడుతున్న దుకుడుగా ఆడిన రెహ్మానుల్లా గుర్భాజ్‌ నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. రెహ్మానుల్లా గుర్భాజ్‌ 39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. 20 బంతుల్లో ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన రింకూ సింగ్‌, నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో జోషువా లిటిల్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్‌, మహ్మద్‌ షమీ వేసిన ఆఖరి ఓవర్‌ ఆఖరి బంతికి అవుట్‌ కాగా డేవిజ్‌ వీజ్‌ ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. లిటిల్‌, నూర్‌ ఆహ్మద్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

  • రింకు ఔట్‌ .. కేకేఆర్‌ 156/6

20 బంతుల్లో 19 పరుగులు చేసిన రింకు సింగ్‌ నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో జాషువా లిటిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కేకేఆర్‌ ప్రస్తుతానికి 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులోకి డేవిడ్‌ వైస్‌ వచ్చాడు. రసేల్‌ 19 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

 

  • రహ్మానుల్లా గుర్బాజ్‌ ఔట్‌.. కేకేఆర్‌ 137/5

38 బంతుల్లో 81 పరుగులు చేసన రహ్మానుల్లా గుర్బాజ్‌ నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రహ్మానుల్లా ఇన్నింగ్స్‌లో 5 పోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. క్రీజులోకి రసెల్‌ వచ్చాడు. కేకేఆర్‌ ప్రస్తుతానికి 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

  • 15 ఓవర్లు పూర్తి.. కేఆకేర్‌ 134/4

15 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్‌ 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో రహ్మానుల్లా గుర్బాజ్‌ 38 బంతుల్లో 81 పరుగులు చేశాడు. మరోవైపు రింకు సింగ్‌ 16 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు.. కేఆకేర్‌ 88/4

జాషువా లిటిల్‌కు ఒకే ఓవర్‌లో 2 వికెట్లు దక్కాయి. తొలుత వెంకటేష్‌ అయ్యర్‌ ఎల్బీగా ఔటవ్వగా క్రీజులోకి వచ్చిన నితీష్‌ రాణా రాహుల్‌ తెవాటియాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. నితీష్‌ రాణా 3 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. క్రీజులోకి రింకు సింగ్‌ వచ్చాడు. కేకేఆర్‌ ప్రస్తుతానికి 88 పరుగులు చేసింది.

  • వెంకటేష్‌ అయ్యర్‌ ఔట్‌.. కేఆకేర్‌ 84/2

జాషువా లిటిల్‌ బౌలింగ్‌లో వెంకటేష్‌ అయ్యర్‌ ఎల్బీగా ఔటయ్యాడు. వెంకటేష్‌ అయ్యర్‌ 14 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. క్రీజులోకి నితీష్‌ రాణా వచ్చాడు. కేకేఆర్‌ ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.

  • రహ్మానుల్లా గుర్బాజ్‌ 50.. కేఆకేర్‌ 80/2

కేకేఆర్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స సాయంతో 50 పరుగుల మార్క్‌ను అందుకన్నాడు. కేకేఆర్‌ 9 ఓవర్లు ముగిసే సరికి 80 పరుగులు చేసింది. వెంకటేష్‌ అయ్యర్‌ 8 బంతుల్లో 9 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • 8 ఓవర్లు పూర్తి.. కేఆకేర్‌ 75/2

8 ఓవర్లు పూర్తయ్యే సరికి కేకేఆర్‌ 2 వికెట్ల నష్టానికి 75 పరగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్‌ 23 బంతుల్లో 48, వెంకటేష్‌ అయ్యార్‌ 6 బంతుల్లో 7 పరుగులు చేశారు. అంతకు ముందు జగదీశన్‌ (19), శార్ధుల్‌ (0)గా త్వరగా పెవిలియన్‌కు చేరారు.

  • పవర్‌ ప్లే పూర్తి.. కేకేఆర్‌ 61/2

పవర్‌ ప్లే పూర్తయ్యే సమయానికి కేకేఆర్‌ 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్‌ 15 బంతుల్లో 39, వెంకటేష్‌ అయ్యార్‌ 2 పరుగు చేశారు.

  • రెండో వికెట్‌ డౌన్‌

షమీకి తన 3వ ఓవర్‌లో మరో వికెట్‌ దక్కింది. 4 బంతులు ఆడిన శార్ధుల్‌ షమీ బౌలింగ్‌లో మోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కేకేఆర్‌ ప్రస్తుతానికి 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్‌ 11 బంతుల్లో 27 పరుగులు చేశాడు. క్రీజులోకి వెంకటేష్‌ అయ్యార్‌ వచ్చాడు.

  • షమీకి తొలి వికెట్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 23 పరుగులు వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన జగదీశన్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శార్దుల్‌ ఠాకుర్‌ వచ్చాడు. రహ్మానుల్లా గుర్బాజ్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • హార్దిక్‌ ఓవర్‌లో 3 ఫోర్లు

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ వేసిన రెండో ఓవర్‌లో కేకేఆర్‌ ఓపెనర్‌ నారాయణ్‌ జగదీశన్‌ 3 ఫోర్లు బాదాడు. తొలి బంతిని డాట్‌ ఆడిన జగదీశన్‌ రెండో బంతిని బౌండరీ తరలించాడు. మూడో బంతిని వైడ్‌, నాల్గో బంతి బౌండరీ, ఆరో బంతి బౌండరీతో మొత్తం 13 పరుగులు సాధించాడు.

  • తొలి ఓవర్‌ 3 పరుగులు 

చినుకులు పడి మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను 4.15కు ప్రారంభించారు. తొలి ఓవర్‌ వేసిన గుజరాత్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను రహ్మానుల్లా గుర్బాజ్‌, నారాయణ్‌ జగదీశన్‌ ప్రారంభించారు.

  • మ్యాచ్‌ ప్రారంభం ఆలస్యం

ఐపీఎల్‌- 2023లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. శుక్రవారం సాయంత్రం మ్యాచ్‌కు ముందు వర్ష పడటంతో మైదానం అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభిచనున్నటు తెలిపారు.

  • టాస్‌ గెలిచిన గుజరాత్‌.. తొలుత బౌలింగ్‌

ఐపీఎల్‌- 2023లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. కేకేఆర్‌ మాత్రం రెండు మార్పులు చేసింది. ఉమేష్‌ యాదవ్‌ స్థానంలో పేసర్‌ హర్షిత్‌ రాణా, జాసన్‌ రారు స్థానంలో రహ్మానుల్లా గుర్బాజ్‌ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు:
గుజరాత్‌ టైటాన్స్‌ :
వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), అభినవ్‌ మనోహర్‌, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), విజరు శంకర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌, మహ్మద్‌ షమీ, మోహిత్‌ శర్మ, జాషువా లిటిల్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: నారాయణ్‌ జగదీశన్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌ (వికెట్‌ కీపర్‌), వెంకటేష్‌ అయ్యర్‌, నితీష్‌ రాణా (కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్‌, రింకూ సింగ్‌, సునీల్‌ నరైన్‌, డేవిడ్‌ వైస్‌, శార్దూల్‌ ఠాకూర్‌, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి