Mar 04,2023 22:00

న్యూఢిల్లీ: కబడ్డీ జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను భారత్‌ వరుసగా రెండోసారి చేజక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత జట్టు 41-32పాయింట్ల తేడాతో ఇరాన్‌ను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్‌ 18-19పాయింట్లతో వెనుకబడ్డా.. రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకొని టైటిల్‌ను చేజిక్కించుకోవడం విశేషం. ఈ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి.