బెంగళూర్ : ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజెల్‌వుడ్ గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ఆరంభం కానున్న తొలి టెస్టు కోసం ఆస్ట్రేలియా క్రికెటర్లు బెంగళూర్‌లో సాధన చేస్తున్నారు. సఫారీతో సిడ్నీ టెస్టులో గాయపడిన హాజెల్‌వుడ్.. బెంగళూర్‌లో పెద్దగా సాధన చేయలేదు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు బౌలింగ్ సాధన చేస్తానని కోచ్‌తో చెప్పాడు. కానీ రనౌప్ సమయంలో ఎడమ కాలు తీవ్రంగా వేధిస్తుండటంతో హాజెల్‌వుడ్ ఫిజియోకు ఫిర్యాదు చేశాడు. నాగ్‌పూర్ టెస్టుతో పాటు రెండో టెస్టు (న్యూఢిల్లీ)కు సైతం హాజెల్‌వుడ్ అనుమానంగానే మారాడు. మిచెల్ స్టార్క్ ఇప్పటికే దూరం కాగా, వేలి గాయంతో కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌కు దూరమయ్యాడు. దీంతో స్కాట్ బలాండ్ విదేశీ గడ్డపై తొలి టెస్టు ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.










