ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ఇంగ్లండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్‌కు మళ్లీ గాయమైంది. అతని కుడి మోచేయికి దెబ్బ తగిలింది. దాంతో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ లో బరిలోకి దిగలేదు. తన గాయానికి చిన్న శస్త్రచికిత్స కోసం ఆర్చర్ ముంబై జట్టును విడిచి బెల్జియం వెళ్లిపోయాడు. ఈ ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను తిరిగి బరిలోకి దిగుతాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. కాగా ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగింటిలో పరాజయం పాలై మూడింటిలోనే గెలిచింది. జోఫ్రా ఆర్చర్ జట్టును వీడితే ముంబై ఇండియన్స్‌కు ఎదురు దెబ్బె అని చెప్పాలి.










