బల్లారి: 2వ ఇండియన్ ఓపెన్ జంప్స్ కాంపిటీషన్‌లో జెస్విన్ అల్డ్రిన్ జాతీయ రికార్డును తిరగరాసాడు. గురువారం జరిగిన లాంగ్‌జంప్ 3వ ప్రయత్నంలో జస్విన్ 8.42మీ. జంప్ చేసి మురళీ శ్రీశంకరన్ పేరిట ఉన్న 8.36మీ. రికార్డును బ్రేక్ చేశాడు. తమిళనాడులోని తూతుకుడికి చెందిన జస్విన్ నెలకొల్పిన జాతీయ రికార్డును అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్విటర్ వేదికగా అధికారికంగా ధృవీకరిస్తూ.. అతనికి శుభాకాంక్షలు తెలిపింది.










