గాలే: శ్రీలంకతో జరుగుతున్న రెండోటెస్ట్‌లో ఐర్లాండ్ జట్టు భారీస్కోర్ దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు సోమవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్ల నష్టానికి 319పరుగులు చేసింది. ఓపెనర్లు జేమ్స్(10), మూర్(5) నిరాశపరిచినా.. కెప్టెన్ ఆండ్రూ(95), స్టెర్లింగ్(74) అర్ధసెంచరీతో రాణించారు. వీరిద్దరికి తోడు టక్కర్(78), ఛాప్టర్(27) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జయసూరియకు రెండు, ఫెర్నాండో, రమేశ్ మెండీస్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఇరుజట్ల మధ్య జరిగిన తొలిటెస్ట్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు ఇన్నింగ్స్ 280పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.










