ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి:తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు గదిలో టవర్ ఎసిని ఏర్పాటు చేశామని డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎసిబి కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. ఇటీవల జైలులో ఉన్న చంద్రబాబు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారన్నారు. ఉక్కపోత వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు వైద్యులు గుర్తించారని తెలిపారు. ఎసిబి కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టవర్ ఎసిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే చంద్రబాబు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. బ్లడ్ ప్రెషర్ 140/80, పల్స్ - 70/మినిట్, శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గా ఉందని తెలిపారు. ఊపిరితిత్తులు, హార్ట్‌బీట్ సక్రమంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన బరువు 67 కేజీలు ఉన్నారని ప్రకటనలో వెల్లడించారు.










