Mar 01,2023 21:57
  • 109 పరుగులకు కుప్పకూలిన టీమిండియా
  • ఆస్ట్రేలియా 156/4

ఇండోర్‌: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా హోల్కర్‌ క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న మూడోటెస్ట్‌లో తొలిరోజు స్పిన్నర్ల హవా కొనసాగింది. దీంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఆసీస్‌ స్పిన్నర్లు కుహ్నెమన్‌, లియాన్‌ దెబ్బతీసారు. దీంతో భారతజట్టు ఇన్నింగ్స్‌ 33.2 ఓవర్లలో 109పరుగులకే ఆలౌటైంది. విరాట్‌ కోహ్లి(22), శుభ్‌మన్‌(21) మాత్రమే రెండు పదుల స్కోర్‌ చేసారు. టీమిండియా ఆటగాళ్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఆసీస్‌ స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు పారేసుకున్నారు. కోహ్లి, గిల్‌ తర్వాత.. ఉమేశ్‌ యాదవ్‌(17) శ్రీకర్‌ భరత్‌ (17), అక్షర్‌ పటేల్‌(12), రోహిత్‌ శర్మ(12) రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. మిగిలిన ప్లేయర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో మాథ్యూ కుహ్నెమాన్‌కు ఐదు, నాథన్‌ లియాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. టాడ్‌ మర్ఫీకి ఒక వికెట్‌ లభించింది.

1
  • ఆస్ట్రేలియా 156/4

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులకే కాగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు ఇప్పటికే 47 పరుగుల ఆధిక్యత లభించింది. ఉస్మాన్‌ ఖవాజా(60) అర్ధసెంచరీతో రాణించగా.. మార్నస్‌ లబుషగే(31), స్టీవ్‌ స్మిత్‌(26) పర్వాలేదనిపించారు. మరో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(9) విఫలమయ్యాడు. ఆసీస్‌ కోల్పోయిన నాలుగు వికెట్లను రవీంద్ర జడేజా పడగొట్టాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీసిన జడేజా.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బౌలింగ్‌తో అలరిస్తున్నాడు.
స్కోర్‌బోర్డు..
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌:
రోహిత్‌ శర్మ (స్టంప్‌)క్యారీ (బి)కుహ్నెమన్‌ 12, శుభ్‌మన్‌ (సి)స్మిత్‌ (బి)కుహ్నెమన్‌ 21, పుజరా (బి)లియాన్‌ 1, కోహ్లి (ఎల్‌బి)మర్ఫీ 22, జడేజా (సి)కుహ్నెమన్‌ (బి)లియాన్‌ 4, శ్రేయస్‌ (బి)కుహ్నెమన్‌ 0, శ్రీకర్‌ భరత్‌ (ఎల్‌బి)లియాన్‌ 17, అక్షర్‌ (నాటౌట్‌) 12, అశ్విన్‌ (సి)క్యారీ (బి)కుహ్నెమన్‌ 3, ఉమేశ్‌ (ఎల్‌బి) కుహ్నెమన్‌ 17, సిరాజ్‌ (రనౌట్‌) హెడ్‌/లియాన్‌ 0, అదనం 0. (33.2 ఓవర్లలో 109ఆలౌట్‌)
వికెట్ల పతనం: 1/27, 2/34, 3/36, 4/44, 5/45, 6/70, 7/82, 8/88, 9/108, 10/109
బౌలింగ్‌: స్టార్క్‌ 5-0-21-0, గ్రీన్‌ 2-0-14-0, కుహ్నెమన్‌ 9-2-16-5, లియాన్‌ 11.2-2-35-3, మర్ఫీ 6-1-23-1.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: Ûటివిస్‌ Vహెడ్‌ (ఎల్‌బి)జడేజా 9, ఖవాజా (సి)శుభ్‌మన్‌ (బి)జడేజా 60, లబూషేన్‌ (బి)జడేజా 31, స్మిత్‌ (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)జడేజా 26, లబూషేన్‌ (బ్యాటింగ్‌) 7, గ్రీన్‌ (బ్యాటింగ్‌) 6, అదనం 17. (54 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 156పరుగులు.
వికెట్ల పతనం: 1/12, 2/108, 3/125, 4/146
బౌలింగ్‌: అశ్విన్‌ 16-2-40-0, జడేజా 24-6-63-4, అక్షర్‌ 9-0-29-0, ఉమేశ్‌ 2-0-4-0, సిరాజ్‌ 3-0-7-0