- - రోహిత్, కోహ్లికి విశ్రాంతి
- - న్యూజిలాండ్‌తో తొలి టి20 నేడు
- - రాత్రి 7.00గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
రాంచీ: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఇక టి20 సిరీస్‌పై దృష్టి సారించింది. సీనియర్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, కోహ్లి న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు విశ్రాంతి కోరుకోవడంతో యువ ఆటగాళ్లతోనే టీమిండియా బరిలోకి దిగనుంది. పేసర్లు సిరాస్, షమీ, శార్దూల్ కూడా అదే బాటలో నిలవడంతో యువ బౌలర్లు ఆర్ష్‌దీప్, శివమ్ మావి, ఉమ్రన్‌పైనే టీమిండియా ఆశలున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత టి20 జట్టులో చోటు దక్కించుకున్న పృథ్వీ షా తుది జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో వేచిచూడాల్సిన పరిస్థితి. ఇక వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్‌తో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయం. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఓ డబుల్ సెంచరీ, మరో సెంచరీ చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఈ ఫార్మాట్‌లో ఐసిసి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండడం మనకూ కలిసిరానుంది. శ్రీలంకతో జరిగిన మూడు టి20 సిరీస్‌కు టీమిండియా జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. అదే ఊపుతో టి20 సిరీస్‌లోనూ రాణించాలని చూస్తోంది. మూడు టి20ల సిరీస్‌ల భాగంగా తొలి మ్యాచ్‌కు స్వదేశంలో ఇప్పటివరకు జరిగిన 12టి సిరీస్‌లలో భారత్ 10 గెలిచి మరో 2 సిరీస్‌ను డ్రా చేసుకొని దుర్భేద్య ఫామ్‌లో ఉంది. స్వదేశంలో 2019లో ఆస్ట్రేలియా చేతిలో చివరి సారిగా టీమిండియా టి20 సిరీస్‌ను చేజార్చుకుంది. ఇక న్యూజిలాండ్‌పై టీమిండియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.
మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఈ సిరీస్‌లోనైనా బోణీ కొట్టాలని చూస్తోంది. కెప్టెన్ మిఛెల్ సాంట్నర్‌కు టీమిండియా నుంచి అగ్నిపరీక్ష ఎదురుకానుంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ లిస్టర్ అరంగేట్రం చేయనున్నాడు.
జట్లు
ఇండియా : హార్దిక్(కెప్టెన్), సూర్యకుమార్(వైస్ కెప్టెన్), ఇషాన్, గైక్వాడ్, శుభ్‌మన్, దీపక్ హుడా, త్రిపాఠి, జితేశ్ శర్మ, సుందర్, కుల్దీప్, చాహల్, ఆర్ష్‌దీప్, ఉమ్రన్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్
న్యూజిలాండ్: సాంట్నర్(కెప్టెన్), అలెన్, మిఛెల్ బ్రాస్‌వెల్, ఛాప్‌మన్, క్లేవర్, కాన్వే, డఫీ, ఫెర్గుసన్, లిస్టర్, మిఛెల్, ఫిలిప్స్, రిప్పన్, షిప్లే, ఇష్ సోథీ, టిక్నెర్.










