Mar 09,2023 09:17

అహ్మదాబాద్‌ : బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనుకున్నట్టే మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత్‌, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్రమోడీ, ఆంటోనీ అల్బానెస్‌ స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియం విశేషాలను కామెంటేటర్‌ రవిశాస్త్రి ప్రధానులిద్దరికీ వివరించి చెప్పారు. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ తరపున అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ఆసీస్‌ ప్రధానికి జ్ఞాపిక అందజేశారు. ఇరు జట్ల ఆటగాళ్లను కలుసుకున్నారు. ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్‌, స్మిత్‌కు ప్రధానులు క్యాప్‌లను అందించారు.

 

1