అహ్మాదాబాద్: అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో 56 ఒవర్లు పూర్తయ్యే సరికి భారత్ 171 పరుగులు చేసింది. శుభమాన్ గిల్ 181 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 91 పరుగులు చేశాడు. పుజారా 105 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో 36 పరుగులు చేశాడు. భారత్ ఇంకా 309 పరుగులు వెనుకబడి ఉంది.
- లంచ్ బ్రేక్.. భారత్ 129/1
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ దీటుగా బదులిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 36/0తో మూడో రోజు, శనివారం ఆట కొనసాగించిన భారత్ లంచ్ విరామానికి ఒక వికెట్ నష్టానికి 129/1 స్కోరుతో నిలిచింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ (119 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 65 బ్యాటింగ్) ఆకట్టుకుంటున్నాడు. చతేశ్వర్ పుజారా (22 బ్యాటింగ్) మంచి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం రెండో వికెట్ కు గిల్, పుజారా అజేయంగా 55 పరుగులు జోడించారు. మొత్తంగా మూడో రోజు తొలి సెషన్‌లో భారత్ ఒక వికెట్ కోల్పోయి 93 పరుగులు రాబట్టింది.
That's Lunch 🍽️ on Day 3⃣ of the Fourth #INDvAUS Test!
— BCCI (@BCCI) March 11, 2023
A great morning session for #TeamIndia 🇮🇳 as we move to 129/1
We will be back for the second session shortly!
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE@mastercardindia pic.twitter.com/r0CHvFnrKC
- శుభమన్ గిల్ 50..భారత్ స్కోరు 100/1
అహ్మాదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫోర్త్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 92 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 100/1గా ఉంది. క్రీజ్‌లో గిల్ 51, పూజారా12 ఉన్నారు.

- తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ ఔట్..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన రోహిత్ శర్మ కున్హెమన్ బౌలింగ్‌లో లబుషేన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు వికెట్ నష్టానికి 74 పరుగులు. గిల్ 38, పుజారా క్రీజులో ఉన్నారు.
- మూడోరోజు ఆట ప్రారంభం..
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో మూడోరోజు ఆట మొదలైంది. మూడోరోజు టీమిండియాకు కీలకం కానుంది. తొలి రెండురోజులు పూర్తి ఆధిపత్యం చూపించిన ఆసీస్ చివరి సెషన్‌లో వికెట్లు పారేసుకుంది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17), శుభ్‌మన్ గిల్ (18) క్రీజులో ఉన్నారు.










