Mar 10,2023 11:13

అహ్మదాబాద్‌ టెస్టులో రెండో రోజు ఆటలో ఎట్టకేలకు టీమిండియాకు కామెరాన్‌ గ్రీన్‌ రూపంలో తొలి వికెట్‌ దక్కింది.సెంచరీ పూర్తి చేసుకున్న గ్రీన్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఆలిస్‌ కారీని (0)ఔట్‌ చేశాడు. ఆ తరువాతి ఓవర్‌లో ఆవెంటనే స్టార్క్‌ ఇచ్చిన క్యాచ్‌ను అయ్యార్‌ పట్టడంతో భారత శిబిరంలో ఆనందం నింపాడు.

  • గ్రీన్‌ 100.. ఆస్ట్రేలియా 355/4

ఆస్ట్రేలియా బ్యాటర్‌ కామెరాన్‌ గ్రీన్‌ శతకంతో మెరిశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో గ్రీన్‌ 143 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో శతకం సాధించాడు. గ్రీన్‌ కెరీర్‌లో ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. కాగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా తొలిసారి బ్యాటింగ్‌లో ఒక రికార్డు నమోదైంది.

  • లంచ్‌ బ్రేక్‌..

అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆటలో లంచ్‌ విరామ సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా 150 పరుగుల మార్క్‌ను అందుకొని అజేయంగా ఆడుతుండగా.. గ్రీన్‌ 95 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 177 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. ఆసీస్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది.

  • 300 దాటిన ఆస్ట్రేలియా స్కోరు

నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా దూకుడు కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో ఆసీస్‌ జట్టు స్కోరు 300 దాటింది. 114 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. ఖవాజా 140, గ్రీన్‌ 85 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • గ్రీన్‌ 50

ఆస్ట్రేలియా బ్యాటర్‌ కామెరాన్‌ గ్రీన్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 99 ఓవర్లలో 267/4గా ఉంది. ఉస్మాన్‌ ఖవాజా 111, గ్రీన్‌ 54 పరుగులతో ఆడుతున్నారు.

  • రెండోరోజు మొదలైన ఆట

అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండోరోజు ఆట మొదలైంది. తొలిరోజు ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖాజా (251 బంతుల్లో 104 బ్యాటింగ్‌బీ 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. ఖాజాతో పాటు కామెరాన్‌ గ్రీన్‌ (49 బ్యాటింగ్‌బీ 8 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.