నాగ్‌పూర్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. 223 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. అశ్విన్, జడేజా దాటికి 91 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్ 5, జడేజా 2, షమీ, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించారు. కాగా ఆసీస్ బ్యాటర్లలో స్మిత్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైన భారత్.. ఆసీస్ ముందు 223 పరుగుల ఆధిక్యాన్ని నిలిపింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ(120) సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులతో రాణించారు.
A splendid five-wicket haul in the second innings from @ashwinravi99 inspires #TeamIndia to a comprehensive victory in the first #INDvAUS Test 🙌🏻
— BCCI (@BCCI) February 11, 2023
Scorecard ▶️ https://t.co/SwTGoyHfZx…#INDvAUS | @mastercardindia pic.twitter.com/wvecdm80k1
- కష్టాలో ఆసీస్.. 68కే సగం వికెట్లు డౌన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాదించింది. ఆశ్విన్ దాటికి 68 పరుగులకే 5 వికెట్లు కొల్పొయింది. తొలుత ఒపెనర్లు ఖవాజా, వార్నర్‌ను బుట్టలో వేసుకఁన్న ఆశ్విన్ 16వ ఒవర్‌లో రెన్‌షా(2) ఔట్ చేశాడు. అనంతరం 18వ ఓవర్‌లో హ్యాండ్స్‌కాంబ్‌ను పెవిలియన్‌కఁ పంపాడు. అంతకఁ ముందు 17 పరుగులు చేసిన లంబుషేను జడేజా ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 68/5గా ఉంది. ప్రస్తుతం క్రీజులో స్మిత్, అలెక్స్ క్యారీ ఉన్నారు.
That moment when you get the DRS right! 🙌🏻
— BCCI (@BCCI) February 11, 2023
There's no stopping #TeamIndia today!
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/ixZz5hU5qq
- భారత్ 400 ఆలౌట్.. ఆసీస్‌పై 223 పరుగుల అధిక్యం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగుల అధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 321/7తో బ్యాటింగ్ ప్రారంభంచిన టీమిండియా మూడో రోజు మరో 79 రన్స్ సాధించి 400 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో టీమిండియాకు మొదటి ఇన్నింగ్స్‌లో 223 రన్స్ లీడ్ లభించింది. మూడో రోజు ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే రవీంద్ర జడేజా (70)ను మర్ఫీ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ (37) అక్షర్‌కు తోడుగా నిలిచాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో ఆసీస్ బౌలర్లపై దాడి చేశాడు. ఈ క్రమంలో మర్ఫీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం అక్షర్ పటేల్ (84)ను కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత్ బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (120) అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రాహుల్ (20), అశ్విన్ (23), పుజారా (7), కోహ్లీ (12), సూర్యకుమార్ (8) అంతగా ఆకట్టుకోలేకపోయారు. వీరికి తోడు మూడో రోజు అక్షర్ పటేల్, షమీ కాసేపు పోరాడడంతో ఇండియా మంచి స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ 7, కమిన్స్ 2, లియాన్ 1 వికెట్ తీసుకున్నారు.










