న్యూఢిల్లీ: ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ దశ షెడ్యూల్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా విడుదల చేశారు. చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో మే 23న క్వాలిఫయర్-1, మే 24న ఎలిమినేటర్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మే 26న క్వాలిఫయర్-2 మ్యాచ్, మే 28న ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.










