ఐపీఎల్ 2023 ముగింపు వేడుకకు సర్వం సిద్ధమైంది. రేపు అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఐపిఎల్ మ్యానేజ్‌మెంట్ ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన జాబితాను ఐపిఎల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఈ ముగింపు వేడుకలో రాపర్ కింగ్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ న్యూక్లియా ప్రదర్శన ఇవ్వనున్నారు. రాపర్ డివైన్, గాయని జోనితా గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
ఐపీఎల్-16వ సీజన్ ప్రారంభ వేడుకల్లో అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, రష్మిక మందనా ప్రేక్షకులను అలరించారు. ప్రారంభ వేడుకలను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసేందుకు కోటీ మంది హాజరయ్యారు. టీవీలు, ఫోన్లలోనూ ఈ వేడుకలను కోట్లాది మంది వీక్షించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షకులు చూడొచ్చు.. అలాగే డిజిటిల్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని జియో సినిమాలో చూడవచ్చు.
Ahmedabad 🏟️ - You are in for a treat! 🙌
— IndianPremierLeague (@IPL) May 26, 2023
Brace yourselves for an iconic evening as King & @NUCLEYA have some power-packed performances in store for you 🎶🌠
How excited are you to witness the two in action 🎤🔥#TATAIPL | #Final pic.twitter.com/58eBwZAFWh










