Aug 03,2022 09:20

కంచికచర్ల (ఎన్‌టిఆర్‌) : కంచికచర్ల మండలంలో మంగళవారం రాత్రి 3 గంటలపాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో మండల పరిధిలోని వాగులు, వంకలూ పోటెత్తాయి. అర్ధరాత్రి సమయంలో కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద ఉన్న లక్ష్మయ్య వాగు కు భారీగా వరద చేరింది. దీంతో కంచికచర్ల - చెవిటి కల్లు రోడ్డపై 10 అడుగుల మేర వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కంచికచర్ల సమీపంలో ఉన్న నక్కల వాగుకు భారీగా వరద నీరు చేరింది. కంచికచర్ల లో వర్షపాతం. 72.0 మిల్లీమీటర్లుగా నమోదయ్యింది.