Feb 25,2023 12:01

ముంబాయి : ఆస్ట్రేలియన్ల చేతిలో ఐదు పరుగుల తేడాతో భారత జట్టు ఓడిన విషయం తెలిసిందే.. ఓటమి బాధతో మైదానంలోనే కన్నీళ్ల పర్యంతమైన హర్మన్‌ అభిమానులను ఉద్దేశించి ట్విట్టర్లో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్‌ చేసింది. 'ఈ ప్రపంచకప్‌లో మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అభిమానులందరికీ కతజ్ఞతలు. మా ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మీ జట్టు ఓటమిని చూడటం ఎంత బాధగా ఉంటుందో క్రికెట్‌ అభిమానిగా నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటే మేం బలంగా తిరిగి వస్తాం. గొప్ప ప్రదర్శన చేస్తాం' అని కౌర్‌ ట్విట్టర్‌లో పేర్కొంది.