- కాగ్ అడిగినా చెప్పని ఆర్థికశాఖ
- ఎజి కార్యాలయం నురచి మళ్లీ లేఖ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఎకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి లెక్కలు చెప్పడంలో ఆర్థికశాఖ ఇంకా కప్పదాటు వ్యవహారంగానే ముందుకు సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీలు, చేసిన అప్పుల వివరాలు లేకుండానే కాగ్ గణాంకాలు విడుదల చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అదే పంథాలో సాగుతోంది. కాగ్ విడుదల చేసిన తొలి రెండు నెలల లెక్కల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించిరది. తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారెంటీలు, అప్పుల వివరాలు రాలేదని స్పష్టం చేయడం గమనార్హం.చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే రుణాలు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిలోకే వస్తాయని కేంద్రం తేల్చి చెబుతోంది. రిజర్వ్‌బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకున్న రుణాలతోపాటు, పలు సంస్థలకు గ్యారెంటీలుగా ఇచ్చిన రుణాలు కూడా ఈ పరిమితిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంస్థలకు ఇచ్చిన గ్యారెంటీ రుణాలు అధికంగా ఉండడంతో వాటి వివరాలను కొంతవరకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఈ వివరాలను కాగ్‌కు సమర్పించడంలో విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే తమ చేతికి గ్యారెంటీల వివరాలు అందడం లేదని కాగ్ పదేపదే రాష్ట్ర ఆర్థికశాఖకు లేఖలు రాస్తోరది. తాజాగా ఇదే అంశంపై ఆర్థికశాఖ అధికారులకు మరో లేఖ రాసినట్లు తెలిసింది. ఇదే సమయంలో మొతం రుణాల వివరాలు కూడా సమర్పించాలని కాగ్ కోరినట్లు సమాచారం. ఇప్పటికే గ్యారెంటీలు, రిజర్వ్‌బ్యాంకు వేలం ప్రక్రియ ద్వారా తీసుకున్న రుణాలు వాస్తవంగా ఏడాది మొత్తానికి కలిగిన పరిమితిని కూడా దాటేసినట్లు కనిపిస్తోంది. తరువాత కాలంలో తీసుకోబోయే రుణాలకు అదనపు అనుమతి కావాల్సిందేనని అధికారులే అంటున్నారు. అందుకే లెక్కలు సమర్పించడంలో ఆర్థికశాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.










