అహ్మదాబాద్ : ఐపిఎల్ 16లో ఢిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 62 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. గుజరాత్ విధించిన 234 పరుగుల భారీ లక్ష్య చేధనలో మంబయి 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటయింది. లక్ష్య చేధనలో ముంబయి ఓపెనర్లు ఇద్దరూ నిరాశపర్చారు. సూర్య కుమార్ యాదవ్ (61 పరుగులు, 38 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఏడు ఫోర్లు)తో కొద్ది సేపు పోరాటం చేశాడు. తిలక్ వర్మ (43 పరుగులు), గ్రీన్ (30) మినహా మిగిలిన బ్యాటర్లు పూర్తిగా నిరాశపర్చారు. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు భారీ స్కోరు చేసింది. జట్టులో శుభ్‌మన్ గిల్ శతకంతో (129 పరుగులు, 60 బంతుల్లో 10 సిక్స్‌లు, ఏడు ఫోర్లు) అధరగొట్టాడు. ఆదివారం చెన్నై, గుజరాత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (స్టంప్డ్) ఇషాన్ (బి) చావ్లా 18; గిల్ (సి) డేవిడ్ (బి) ఆకాశ్ 129; సుదర్శన్ (రిటైర్డ్ అవుట్) 43; పాండ్యా (నాటౌట్) 28; రషీద్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 233.వికెట్ల పతనం: 1–54, 2–192, 3–214.
బౌలింగ్: బెహ్రన్‌డార్ఫ్ 4–0–28–0, గ్రీన్ 3–0–35–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–52–1, జోర్డాన్ 4–0–56–0, చావ్లా 3–0–45–1, కార్తికేయ 2–0–15–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) లిటిల్ (బి) షమీ 8; వధేరా (సి) సాహా (బి) షమీ 4; గ్రీన్ (బి) లిటిల్ 30; సూర్యకుమార్ (బి) మోహిత్ 61; తిలక్ వర్మ (బి) రషీద్ 43; విష్ణు (సి) పాండ్యా (బి) మోహిత్ 5; డేవిడ్ (ఎల్బీ) (బి) రషీద్ 2; జోర్డాన్ (సి) సుదర్శన్ (బి) మోహిత్ 2; చావ్లా (సి) మిల్లర్ (బి) మోహిత్ 0; కార్తికేయ (సి) మిల్లర్ (బి) మోహిత్ 6; బెహ్రన్‌డార్ఫ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 171. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–72, 4–124, 5–155, 6–156, 7–158, 8–161, 9–162, 10– 171.
బౌలింగ్: షమీ 3–0–41–2, పాండ్యా 2–0– 24–0, రషీద్ 4–0–33–2, నూర్ 4–0–35–0, లిటిల్ 3–0–26–1, మోహిత్ 2.2–0–10–5.










