- లక్ష్యఛేదనలో 157 పరుగులకు గుజరాత్ ఆలౌట్
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో సీఎస్కే 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 42, రషీద్ ఖాన్ (30) పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (4), తెవాటియా (3) విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లు దీపక్ చహర్ 2, మహీశ్ తీక్షణ 2, రవీంద్ర జడేజా 2, మతీష పతిరణ 2, తుషార్ దేశ్ పాండే 1 వికెట్ తీశారు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లోకి ప్రవేశించడం ఇది పదోసారి. ఈ నెల 28న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ విజేతతో తలపడనుంది. నేటి మ్యాచ్ లో ఓడిన గుజరాత్ టైటాన్స్ కు మరో చాన్స్ ఉంది. ఆ జట్టు మే 26న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడనుంది.
- గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 173
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 60, డెవాన్ కాన్వే 40 పరుగులు చేయగా.. ఆఖర్లో జడేజా 16 బంతుల్లో 22, మొయిన్ అలీ 4 బంతుల్లో 9 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మ్‌ద్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
- 13 ఓవర్లు పూర్తి.. చెన్నై 99/2
13 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే 28 బంతుల్లో 31 పరుగులు, రహానే 4 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు రుతరాజ్ గైక్వాడ్ 59, శివం దూబే 1 పరుగు చేసి పెవిలియన్‌కు చేరారు.
- శివమ్ దూబే ఔట్
చెన్నై బ్యాటర్ శివమ్ దూబే నూర్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దూబే 3 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. క్రీజులోకి రాహానే వచ్చాడు.
You miss, I hit 😎
— IndianPremierLeague (@IPL) May 23, 2023
Noor Ahmad gets Shivam Dube with a beauty 🎯
Follow the match ▶️ https://t.co/LRYaj7cLY9#TATAIPL | #Qualifier1 | #GTvCSK pic.twitter.com/OjtjAsXLXT
- రుతురాజ్ గైక్వాడ్ ఔట్
మోహిత్ శర్మ బౌలింగ్‌లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. చెన్నై ప్రస్తుతం వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో శివవ్ దుబే, డెవాన్ కాన్వే ఉన్నారు.
Mohit Sharma gets the big breakthrough ⚡️⚡️
— IndianPremierLeague (@IPL) May 23, 2023
Ruturaj Gaikwad departs as David Miller takes the catch 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/LRYaj7cLY9#TATAIPL | #Qualifier1 | #GTvCSK pic.twitter.com/g5w1JAHOOO
- 10 ఓవర్లలో 85
10 ఓవర్లలో చెన్నై 85 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 42 బంతుల్లో 59, డెవాన్ కాన్వే 19 బంతుల్లో 24 పరగులు చేశారు.
- రుతురాజ్ గైక్వాడ్ 50
చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 36 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ 36 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు.
5️⃣0️⃣* & going strong 😎
— IndianPremierLeague (@IPL) May 23, 2023
Ruturaj Gaikwad is timing the ball perfectly in the middle and looks in 🔝 touch 👌🏻#CSK 70/0 after 8.3 overs 🔥
Follow the match ▶️ https://t.co/LRYaj7cLY9#TATAIPL | #Qualifier1 | #GTvCSK pic.twitter.com/AsoY44OHtG
- 8 ఓవర్లకు చెన్నై64
8 ఓవర్లుకు చెన్నై ఓపెనర్లు 64 పరుగులు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ 35 బంతుల్లో 46 (5ఫోర్లు 1 సిక్స్), డెవాన్ కాన్వే 14 బంతుల్లో 16 (2 ఫోర్లు) పరుగులు చేశారు.
End of Powerplay!
Devon Conway & Ruturaj Gaikwad are off to a bright start as #CSK move to 49/0 after 6 overs 👊🏻
Follow the match ▶️ https://t.co/LRYaj7cLY9#TATAIPL | #Qualifier1 | #GTvCSK pic.twitter.com/DdjIB8QSNO
— IndianPremierLeague (@IPL) May 23, 2023
- పవర్ ప్లే పూర్తి.. చెన్నై49/0
పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి చెన్నై వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 33, డెవాన్ కాన్వే 11 బంతుల్లో 14 పరుగులు చేశారు. మరో వైపు ఈ జోడీని విడడియడానికి గుజరాత్ శ్రమిస్తోంది
Gaikwad: From🙁 to 🤩
— JioCinema (@JioCinema) May 23, 2023
A twist of fate sees Ruturaj maximize with the bat in #GTvCSK ⚔️#IPLPlayOffs #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @ChennaiIPL pic.twitter.com/dOfabAaXTS
- రెండు ఓవర్లకు 18
రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 18 పరగులు చేసింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 14, డెవాన్ కాన్వే 2 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు.
- టాస్ గెలిచిన గుజరాత్.. తొలుత బౌలింగ్
ఐపీఎల్16 ఫైనల్లో తొలి అడుగు వేసేందుకు నేడు చెపాక్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ క్వాలిఫయర్1 పోరుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్‌కు దిగనుంది.
జట్లు
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ










