Mar 09,2023 06:46
  • బెంగళూరుపై 11 పరుగుల తేడాతో గుజరాత్‌ గెలుపు

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ గుజరాత్‌ జెయింట్‌ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన గుజరాత్‌ జట్టు.. బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 190పరుగులే చేయగల్గింది. దీంతో బెంగళూరు జట్టు ఈ టోర్నమెంట్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది. టాస్‌ తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జట్టులో సోఫియా డంక్లే, హర్లీన్‌ డియోల్‌ ఆకాశమే భాగంగా హద్దుగా చెలరేగారు. ఓపెనర్‌ మేఘన(8) నిరాశపరిచినా.. మరో ఓపెనర్‌ సోఫియా డంక్లీ, హర్లీన్‌ డియెల్‌ అర్ధసెంచరీలతో మెరిసారు. దీంతో గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. డంక్లే (65; 28బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు) క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో విధ్వంసం సృష్టించింది. హర్లీన్‌ డియోల్‌ (67; 45బంతుల్లో 9ఫోర్లు, సిక్సర్‌) కూడా దూకుడుగా ఆడింది. వీరిద్దరు ఔటయ్యాక గార్డినర్‌(14), హేమలత (16), సథర్లాండ్‌(14), స్నేV్‌ా రాణా(2) ఇలా వచ్చి అలా వెళ్లారు. తొలుత గుజరాత్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా ప్రారంభమైంది. మేఘన ఔటైన తర్వాత సోఫియా డంక్లీ దూకుడు పెంచింది. రేణుకా సింగ్‌ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదింది. ప్రీతి వేసిన తర్వాతి ఓవర్లో సోఫియా బౌండరీల మోత మోగించింది. వరుసగా 4,6,4,4,4 కొట్టి 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. శ్రేయాంక పాటిల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో సిక్సర్‌, ఫోర్‌ బాది చివరి బంతికి హీథర్‌ నైట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. పెర్రీ వేసిన 17 ఓవర్లో హర్లీన్‌ డియోల్‌ వరుసగా మూడు ఫోర్లు బాది అర్ధ శతకాన్ని పూర్తి చేసుకుంది. బెంగళూరు బౌలర్లు శ్రేయాంక, హీథర్‌ నైట్‌కు రెండేసి, స్కట్‌, రేణుకకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో బెంగళూరు జట్టు పవర్‌ ప్లే ఓవర్లు పూర్తయ్యేసరికి 59పరుగులు చేసినా.. ఆ తర్వాత స్కోర్‌ నెమ్మదించింది. చివర్లో హీథర్‌ నైట్‌(30నాటౌట్‌; 11బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌) ప్రయోజనం లేకపోయింది. సోఫీ డివైన్‌(66) అర్ధసెంచరీతో మెరిసింది. గార్డినర్‌కు మూడు, సథర్లాండ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు...
గుజరాత్‌ జెయింట్స్‌ మహిళల ఇన్నింగ్స్‌:
మేఘన (సి)రీచా (బి)స్కట్‌ 8, డంక్లే (సి)హీథర్‌ నైట్‌ (బి)శ్రేయాంక 65, హర్లిన్‌ డియోల్‌ (బి)శ్రేయాంక 67, గార్డినర్‌ (స్టంప్‌) రీచా (బి)హీథర్‌ నైట్‌ 19, హేమలత (సి)రేణుక (బి)హృతర్‌ నైట్‌ 16, సథర్లాండ్‌ (సి)హీథర్‌ నైట్‌ (బి)రేణుక 14, స్నేV్‌ా రాణా (రనౌట్‌) ఎలీసా పెర్రీ/రీచా 2, కిమ్‌ గరాత్‌ (నాటౌట్‌) 3, సుష్మా (నాటౌట్‌) 5, అదనం 2. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 201పరుగులు. వికెట్ల పతనం: 1/22, 2/82, 3/135, 4/157, 5/187, 6/192, 7/196 బౌలింగ్‌: స్కట్‌ 3-1-26-1, ఎలీసా పెర్రీ 4-0-43-0, రేణుక 4-0-36-1, ప్రీతి బోస్‌ 3-0-47-0, శ్రేయాంక పాటిల్‌ 4-0-32-2, హీథర్‌ నైట్‌ 2-0-17-2.
బెంగళూరు మహిళల ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (సి)మాన్సీ జోషీ (బి)గార్డినర్‌ 18, సోఫీ డివైన్‌ (సి)గార్డినర్‌ (బి)సథర్లాండ్స్‌ 66, ఎలీసా ఫెర్రీ (సి)హేమలత (బి)మాన్సి జోషీ 32, రీచా ఘోష్‌ (బి)గార్డినర్‌ 10, హీథర్‌ నైట్‌ (నాటౌట్‌) 30, కనిక అహూజ (స్టంప్‌)సుష్మా (బి)గార్డినర్‌ 10, ఖెమ్నర్‌ (సి)సబ్‌ అశ్విని (బి)సథర్లాండ్‌ 2, శ్రేయాంక పాటిల్‌ (నాటౌట్‌) 11, అదనం 11. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 190పరుగులు. వికెట్ల పతనం: 1/54, 2/97, 3/125, 4/141, 5/169, 6/178 బౌలింగ్‌: కిమ్‌ గారత్‌ 3-0-27-0, తనూజ కన్వార్‌ 4-0-28-0, అస్ట్లీ గార్డినర్‌ 3-0-31-3, సథర్లాండ్‌ 4-0-56-2, స్నేV్‌ా రాణా 4-0-34-0, మాన్సి జోషీ 1-0-9-1.