- గుజరాత్‌పై 143 పరుగుల తేడాతో ముంబయి గెలుపు
ముంబయి: మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) తొలి లీగ్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరు గుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో గుజరాత్ జట్టు 64 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ యస్టికా భాటియా(1) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ హీలీ మాథ్యూస్(47), స్కీవర్ బ్రంట్(23) కలిసి 2వ వికెట్‌కు 54పరుగులు జతచేశారు. ఆ తర్వాత కెప్టెన్‌హర్మన్‌ప్రీత్ కౌర్(65; 30బంతుల్లో 14ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. అమేలియా కెర్ర్(45; 24బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్), పూజ వస్త్రాకర్(15; 8బంతుల్లో 3ఫోర్లు) కూడా చెలరేగారు. స్నేV్‌ా రాణాకు రెండు, వారేహామ్, తనూజ, గార్డినర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో గుజరాత్ బ్యాటర్స్ స్నేహ రాణా(29) మాత్రమే రాణించగా.. షేక్ ఇష్క్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు(సంక్షిప్తంగా...)
ముంబరు : 207/5 (20 ఓవర్లలో; హర్మన్ 65, అమేలియా 45; స్నేV్‌ా రాణా 2/43)
గుజరాత్ : 64ఆలౌట్ (15.2 ఓవర్లలో; హేమలత 29; షేక్ ఇష్క్ 4/11, స్కీవర్ 2/5)











