Oct 18,2023 16:20

కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం గోల్డ్‌లోన్‌ బ్రాంచి కార్యాలయంలో రూ.6 కోట్ల విలువ చేసే 10.660 కేజీల బంగారం అపహరణకు గురైంది. బ్రాంచ్‌లో పనిచేసే పావని అనే ఉద్యోగిని మరో వ్యక్తితో కలిసి చోరీకి పాల్పడినట్టు.. బ్యాంకు ఉద్యోగులు ఉన్నతాధికారులు సమాచారమందించారు. ఉన్నతాధికారులు వచ్చి ఖాతాదారుల రికార్డులు పరిశీలించి నివేదిక తయారు చేశారు. బ్రాంచిలో 1477 మంది ఖాతాదారులు ఉండగా.. 16కేజీల బంగారం తాకట్టులో ఉంది. ఇందులో 10.660 కేజీల బంగారం పావని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఘటనపై కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలికి సహకరించిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితురాలు పావని కోసం పోలీసులు గాలిస్తున్నారు.