Feb 26,2023 22:15

ఆస్ట్రేలియా : మనం ఇప్పటి వరకు ఎన్నో ఫైనల్‌ మ్యాచ్‌లు చూసి ఉంటాం. కానీ, వాటిలో రసవత్తరంగా సాగిన కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఎప్పటికీ గుర్తుంటాయి. అలాంటి మ్యాచే ఆస్ట్రేలియాలోని ఓ దేశవాళీ లీగ్‌లో జరిగింది. శనివారం ఉమెన్స్‌ నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌  ఫైనల్‌ మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా, టాస్మానియా జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన టాస్మానియా నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనకు దిగిన సౌత్‌ ఆస్ట్రేలియా 44 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. తర్వాత డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం.. సౌత్‌ ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 47 ఓవర్లలో 243కి సవరించారు. 46 ఓవర్లకు ఆ జట్టు 239/5 స్కోరుతో ఉంది. 6 బంతుల్లో 4 పరుగులు చేస్తే సౌత్‌ ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది.
అయితే, ఇప్పుడే అసలు ఆట షురూ అయింది. కోయిటె వేసిన ఈ ఆఖరి ఓవర్‌లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఓవర్‌లో రెండో బంతికి మాత్రమే ఒక పరుగు వచ్చింది. మిగతా అన్ని బంతులకు వికెట్లు లభించాయి. దీంతో సౌత్‌ ఆస్ట్రేలియా 241 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టాస్మానియా మహిళల జట్టు ఒక పరుగు తేడాతో విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
ఆఖరి ఓవర్‌ సాగిందిలా..

  • మొదటి బంతి - బౌల్డ్‌
  • రెండో బంతి- ఒక పరుగు
  • మూడో బంతి- స్టంపౌట్‌
  • నాలుగో బంతి- రనౌట్‌
  • ఐదో బంతి- ఎల్బీబ్ల్యూ
  • ఆరో బంతి- ఒక పరుగు చేసిన తర్వాత రనౌట్‌.