May 09,2023 20:28

కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు కెప్టెన్‌ నితీశ్‌ రాణా జరిమానాకు గురయ్యాడు. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్‌ రేట్‌కుగాను రూ.12 లక్షల జరిమానా విధించారు. దాంతో కలిపి ఈ సీజన్‌లో ఇప్పటివరకు బిసిసిఐకి వచ్చిన స్లో ఓవర్‌ రేట్‌ జరిమానాల మొత్తం రూ.1.08 కోట్లకు చేరింది. నితీశ్‌ రాణా కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల కెప్టెన్‌లు తలా రూ.12 లక్షల చొప్పున జరిమానాలు చెల్లించారు. ఇక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కెప్టెన్‌లు అయితే మూడు సార్లు స్లో ఓవర్‌లు వేయించి మొత్తం రూ.36 లక్షలు కట్టారు.