Apr 25,2023 14:53

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్యజిల్లా) : అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ మహిళకు వైద్యం కోసం రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. పీలేరు పట్టణం, కావలిపల్లికి చెందిన కుళ్ళాయమ్మ గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఈ విషయం తెలిసిన ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి రూ.75 వేలు సాయం అందజేశారు. దాత నుంచి వచ్చిన చెక్కును మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణంలో ఏఎంసి మాజీ చైర్మన్‌ కడప గిరిధర్‌ రెడ్డి బాధితురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వైసిపి మహిళా అధ్యక్షురాలు మహిత ఆనంద్‌, జిల్లా పర్యాటక, సంస్కృతిక శాఖ డైరెక్టర్‌ షాకీర్‌, ఏఎంసి మాజీ డైరెక్టర్‌ ఎస్‌ఎల్‌ వి సంజీవయ్య, పార్టీ కార్యకర్తలు ఆబిద్‌, మసూద్‌, ఉదరు తదితరులు పాల్గొన్నారు.