Jun 28,2023 13:31

భోపాల్‌ (మధ్యప్రదేశ్‌) : మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా దుర్సాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బుహ్ర గ్రామంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన దాటుతుండగా మినీ ట్రక్కు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 12మంది మృతి చెందారు. ఐదుగురి మఅతదేహాలు లభ్యం కాగా మిగిలినవారు గల్లంతయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. గ్వాలియర్‌లోని భేలేటి గ్రామం నుంచి తికమ్‌గఢ్‌లోని జాతర గ్రామానికి పెళ్లి వేడుకల కోసం వీరంతా మినీ ట్రక్కులో వెళుతున్నారు. లారీలో దాదాపు 50మంది కూలీలున్నారు. ట్రక్‌ డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 12 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. ఐదుగురి మృతదేహాలు లభ్యం కాగా, మిగిలినవారు గల్లంతయ్యారు.

ఇప్పటికీ కొందరి ఆచూకీ తెలియడం లేదు...
సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని ట్రక్కులోనివారిని రక్షించే ప్రయత్నం చేపట్టారు. అధికార యంత్రాంగం అక్కడకు చేరుకుంది. వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం నదిలో పడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదని.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతుందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మధ్యప్రదేశ్‌ హౌంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

మృతులలో 2, 3 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు : మంత్రి నరోత్తం మిశ్రా
ఈ ఘటనపై హోంమంత్రి నరోత్తం మిశ్రా విచారం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ ... ఖాటిక్‌ కమ్యూనిటీ ప్రజలు బలేహరి నివాసితులు. జాతర (తికమ్‌ఘర్‌) తన కూతురి పెళ్లికి మినీ ట్రక్కులో వెళుతున్నారని అన్నారు. బుహ్ర నది వంతెన దాటుతుండగా ట్రక్కు చక్రం తెగిపోవడంతో ట్రక్కు అదుపుతప్పి నదిలోకి పడిపోయి దూసుకెళ్లిందన్నారు. ఇప్పటి వరకు ఐదుగురి మఅతదేహాలను వెలికి తీశారని, ఇందులో 65 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉందని తెలిపారు. 18 ఏళ్ల యువకుడితోపాటు.. రెండు, మూడు సంవత్సరాల పిల్లలున్నారని చెప్పారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఐదుగురి మఅతదేహాలను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారని వివరించారు.