Jun 13,2023 07:32

అల్లూరు : పిడుగు పడటంతో రైతు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి ఎల్లవరం పంచాయతీ బొంగరాలు పాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నర్సి అప్పన్న నిన్న సాయంత్రం తన పొలంలోకి వెళ్లి పని చేసుకుంటున్న సమయంలో వర్షం పడుతుందని, చెట్టు కింద కూర్చుండగా పిడుగు పడటంతో తన పంట పొలంలోని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలుపుతున్నారు. రాత్రంతా అప్పన్న ఇంటికి రాకపోవడంతో మంగళవారం ఉదయాన్నే వెతుక్కుంటూ పొలంలోకి వెళ్ళగా విగతజీవుడిగా పొలంలో మఅతి చెంది ఉన్న అప్పన్నను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.