ప్రజాశక్తి - నౌపడ :ఎండిపోతున్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి ఎండ తీవ్రతకు గురై రైతు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేట పంచాయితీలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పంచాయతీ పరిధిలోని సంధిపేటకు చెందిన బంగు సింహాచలం (63) తన ఐదెకరాల భూమిలో వరి సాగు చేస్తున్నారు. వంశధార సాగునీరు అందక, వర్షాల్లేక పంట ఎండిపోతుండడంతో గ్రామంలోని పెద్ద చెరువు నుంచి మోటారు ఇంజన్‌తో నీరు పెట్టేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పొలంలోనే కుప్పకూలిపోయారు. గమనించిన చుట్టుపక్కల రైతులు వెళ్లి చూసేసరికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.