Jan 21,2023 14:46

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లలోని బీసీ కార్పొరేషన్‌ చైర్మన్ల పదవీ కాలం పొడిగించారు. 56 మంది బీసీ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్ల పదవి కాలం పొడిగిస్తూ ఎపి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.