Jun 15,2023 13:41

బర్మింగ్‌హౌమ్‌ : రేపట్నుంచి ఇంగ్లాండ్‌ - ఆస్ట్రేలియాల మధ్య బర్మింగ్‌హౌమ్‌ వేదికగా (యాషెస్‌) తొలి టెస్టు మొదలుకానుంది. ఈ తొలి టెస్టు ప్రారంభానికి ఏకంగా రెండు రోజుల ముందే ఇంగ్లాండ్‌ తుది జట్టును ప్రకటించింది. ఈ మేరకు ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) బుధవారం రాత్రి ట్విటర్‌ వేదికగా బర్మింగ్‌హామ్‌ టెస్టులో ఆడబోయే తమ తుది జట్టు ఇదేనని ట్వీట్‌ చేసింది.
యాషెస్‌తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్‌ తుది జట్టు : బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), ఓలీ పోప్‌, జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌, జేమ్స్‌ అండర్సన్‌, హ్యారీ బ్రూక్‌, మోయిన్‌ అలీ, బెన్‌ డకెట్‌, జాక్‌ క్రాలే, ఓలీ రాబిన్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌