May 23,2023 21:45

- 21 మందితో నూతన కమిటీ
ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో:
ఈ నెల 22, 23 తేదీల్లో విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఎల్‌ఐసి ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసి ఎఒఐ) ఆరో జాతీయ మహాసభ మంగళవారం సాయంత్రంతో దిగ్విజయంగా ముగిసింది. 19 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రెండు రోజులపాటు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రతినిధుల చర్చలు జరిగాయి. దేశంలోని 18 రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాసభ రెండో రోజు నూతన కమిటీని ఎన్నుకుంది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తూ 21 మందితో జాతీయ ఆఫీస్‌ బేరర్లను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా సురాజిత్‌ కుమార్‌ బోస్‌, ప్రధాన కార్యదర్శిగా పిజి.దిలీప్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎల్‌.మంజునాథ్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎవి.బెల్లార్‌మిన్‌ (మాజీ ఎంపి), సోమనాధ్‌ భట్టాచార్య, ఎ.సంపత్‌ (మాజీ ఎంపి), సావిత్రిని ఎన్నుకున్నారు. కార్యదర్శులుగా పిఎన్‌.సుధాకరన్‌, పిఎల్‌.నరసింహారావు, మనోరంజన్‌ సర్కారు, ఎం.సెల్వరాజ్‌, సి.కృష్ణన్‌ కుట్టీ, ప్రణవ్‌ శర్మన్‌, గౌరి నంది ఎన్నికయ్యారు. కోశాధికారిగా టి.జాన్‌ విలియమ్‌, సెక్రటేరియట్‌ సభ్యులుగా బిబేకాశిష్‌ మిశ్రా, ఎంకె.మోహనన్‌, శాకలామ్‌, పికె.సదానందన్‌, రామ్‌ ప్రసాద్‌డే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.