Apr 26,2023 13:56

మూడేళ్ల క్రితం ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరిన అర్జున్‌ టెండూల్కర్‌ తాజా ఐపీఎల్‌ సీజన్‌లో తుది జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలో అర్జున్‌ టెండూల్కర్‌పై కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ముంబై జట్టుకు సచిన్‌ టెండూల్కర్‌ మెంటార్‌గా ఉండడం వల్లే అర్జున్‌కు అవకాశాలు వస్తున్నట్లు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బౌలర్‌ బ్రెట్‌ లీ అర్జున్‌కు అండగా నిలిచాడు. విమర్శలను పట్టించుకోవద్దంటూ అర్జున్‌ టెండూల్కర్‌కు కీలక సూచన చేశాడు. ''దాదాపు ప్రతి దానినీ విమర్శించే వ్యక్తులు చుట్టూ ఉంటారు. సందీప్‌ శర్మ బౌలింగ్‌ వేగం 120 కిలోమీటర్లే ఉంది. శర్మ కంటే ఎక్కువ వేగంతో అర్జున్‌ బౌలింగ్‌ చేయగలడు. అతడి వయసు ఇంకా 23 ఏళ్లే. అతడి మొత్తం కెరీర్‌ ఇంకా ముందుంది. విమర్శలను పట్టించుకోవద్దన్నది నా సూచన'' అని బ్రెట్‌ లీ పేర్కొన్నాడు.