ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్‌జిల్లా) : వ్యవసాయానికి వాడుతున్న మోటార్లకు విద్యుత్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని రైతు సంఘం మైలవరం మండల కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి డిమాండ్ చేస్తూ పుల్లూరు సబ్‌స్టేషన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతులను దివాలా తీసే విధానాలు తీసుకువచ్చి రైతు మెడకు ఉరి తాడు వేస్తుందని ,కేంద్రం తీరుతో రైతులు వ్యవసాయానికి దూరమవుతారని , కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చే ప్రతి విధానాన్ని మొట్టమొదట మన రాష్ట్రంలో అనుసరిస్తున్న అని అన్నారు, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలంతా ఐక్యంగా వ్యతిరేకించాలన్నారు. ఒకపక్క అధిక ధరలతో ప్రజల సతమతమవుతుంటే మరో ప్రక్క దేశానికి అన్నం పెట్టే రైతన్నను నడ్డివిరిచే విధానాలు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అని ఇటువంటి ప్రభుత్వాలు సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆర్ రమేష్, రైతు సంఘం మండల అధ్యక్షుడు రావుల సుబ్బారావు, చిలుకూరి సుబ్బారెడ్డి, రైతులు వజ్రాల కృష్ణారెడ్డి, వజ్రాల ప్రతాపరెడ్డి, వజ్రాల భాస్కర్ రెడ్డి, వజ్రాల శ్రీనివాస్ రెడ్డి, వజ్రాల సుధాకర్ రెడ్డి, దేవిరెడ్డి భూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










