- వీసా సమస్యే ప్రధానం కారణం
లాజ్‌ఏంజెల్స్: ఇండియన్ వెల్స్ టోర్నీకి టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్ దూరమయ్యాడు. కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా అమెరికా ప్రభుత్వం అతనికి వీసా నిరాకరించినట్లు సమాచారం. టోర్నీలో ఆడేందుకు కోవిడ్-19 వ్యాక్సిన్ మినహాయింపు కోసం అమెరికా ప్రభుత్వానికి జకోవిచ్ దరఖాస్తు చేసుకోగా.. దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదని టోర్నీ నిర్వాహకులకు ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో జకోవిచ్‌ను ప్రధాన టోర్నీ డ్రా నుంచి మినహాయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం టీకాలు వేయించుకోని విదేశీయులను దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నెగ్గి అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన(22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు) రఫెల్ నాదల్ సరసన నిలిచిన సంగతి తెలిసిందే.










