ప్రజాశక్తి-నందలూరు (అన్నమయ్యజిల్లా) : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పెన్షన్ లబ్ధిదారులకు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా గురువారం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరం కానుకగా సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం పింఛన్ రూ.2,750 లబ్ధిదారులకి అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సౌభాగ్యమ్మ, జిల్లా వర్క్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, మండల కోఆప్షన్ సభ్యుడు కరీముల్లా ఖాన్, సర్పంచ్ జంబు సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ అనుదీప్, వైసీపీ నాయకులు తుమ్మల శ్రీధర్ గౌడ్, నడివీధి సుధాకర్, హిమగిరినాథ్ యాదవ్, ధనుంజయ నాయుడు, మన్సూర్, నవాబ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










