ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య నేటి నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మొదలైంది. మ్యాచ్ ఆరంభమై ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్‌కు రాగా.. అండర్సన్ తొలి ఓవర్ వేశాడు. అండర్సన్ ఓవర్ ముగిసిన తర్వాత వెంటనే పలువురు నిరసనకారులు పిచ్ వద్దకు దూసుకువచ్చారు. పిచ్‌పై ఆరెంజ్ కలర్ లో ఉన్న ఓ రంగు పిండిని చల్లుతూ మ్యాచ్‌కు అంతరాయం కలిగించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఓ నిరసనకారుడిని చేతులతో అమాంతం ఎత్తుకుని అతడిని మెయిన్ పిచ్ నుంచి బౌండరీ లైన్ ఆవల దాకా అలాగే తీసుకొచ్చి పడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Good start to the 2nd test.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) June 28, 2023
Bairstow has done some heavy lifting already😂😂 #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr










