Sep 19,2023 15:28

సంగారెడ్డి : పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, పాలన ప్రజలకు చేరువ కావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. అందులో భాగంగానే కొత్త జిల్లాలు, గ్రామాలు, మండలాలను ఏర్పాటు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంట్‌ అన్నడు. అది ఉత్త కరెంట్‌ అయ్యింది. నాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ ఫార్మర్లు మాత్రమే దర్శనమిచ్చేవని ఆ పార్టీపై మండిపడ్డారు. మంగళవారం జిల్లాలోని నారాయణఖేడ్‌ నియోజకవర్గం, తడ్కల్‌ మండలంలో మైనార్టీ ఫంక్షన్‌ హాల్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్‌కి చెందిన పలువురు నేతలు గులాబీ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పలు అభివఅద్ధి కార్యక్రమాల్లో పాల్గన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ కొనసాగుతున్నది. అర్హులందరికీ మాఫీ అవుతాయని చెప్పారు. మాట చెబితే మడమ తిప్పని పార్టీ బీఆర్‌ఎస్‌ అని స్పష్టం చేశారు. అభివఅద్ధి చేస్తున్న బీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.