Apr 19,2023 14:37

ఢిల్లీ : ఢిల్లీ ఆటగాళ్ల క్రికెట్‌ కిట్‌లు చోరీకి గురయ్యాయి. ఆటగాళ్ల బ్యాట్లు, ఆర్మ్‌ ప్యాడ్స్‌, థై ప్యాడ్స్‌, షుస్‌, గ్లోవ్స్‌ ఇతర విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంఛైజీ ఎయిర్‌పోర్ట్‌ లాజిస్టిక్స్‌ విభాగానికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంఛైజీ తెలిపిన వివరాల ప్రకారం.. కేకేఆర్‌తో మ్యాచ్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ బెంగళూరు నుంచి నేరుగా ఆదివారం(ఏప్రిల్‌16) ఢిల్లీకు చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకున్నాక తమ కిట్లు కనిపించకుండా పోయాయి, చోరికి గురైన వస్తువులలో 16 బ్యాట్‌లు, బూట్లు, ప్యాడ్‌లు, గ్లోవ్‌లు ఉన్నాయి. అందులో డేవిడ్‌ వార్నర్‌వి మూడు బ్యాట్‌లు, మిచెల్‌ మార్ష్‌వి రెండు, ఫిల్‌ సాల్ట్‌ మూడు, యష్‌ ధుల్‌వి ఐదు బ్యాట్లు ఉన్నాయి. దీనిపై ఫ్రాంఛైజీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.