మూడో టెస్ట్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు
ఇండోర్: బోర్డర్‌ాగవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్‌లో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచి అదే దూకుడును టీమిండియా.. మూడో టెస్ట్‌లో చతికిలబడింది. తొలి ఇన్నింగ్స్‌లో 109పరుగులే చేయడం టీమిండియా పరాజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. టీమిండియా నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఖవాజా వికెట్ కోల్పోయి ఛేదించింది. ట్రావిస్ హెడ్(49), లబుషేన్(28) మరో వికెట్ పడకుండా ఆడి మ్యాచ్‌ను ముగించారు. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉండగా.. టీమిండియా డబ్ల్యూటిసి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే చివరి టెస్టులో గెలుపు తప్పనిసరి. ఈ మైదానంలో టీమిండియా దాదాపు పదేళ్ల తర్వాత పరాజయాన్ని చవిచూసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాథన్ లియాన్‌కు లభించింది. అహ్మదాబాద్ వేదికగా మార్చి 9నుంచి నాలుగో టెస్టు జరగనుంది.
డబ్ల్యుటిసి ఫైనల్‌కు ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్లో అడుగుపెట్టింది. మూడో టెస్టులో భారత్‌పై 9వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడంతో ఆ జట్టు ఫైనల్ బెర్తు ఖాయమైంఇ. ఇక భారతజట్టు అహ్మదాబాద్‌లో జరిగే నాలుగో టెస్టులో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉంది. లేదంటే మూడో స్థానంలో ఉన్న శ్రీలంక ఫైనల్ చేరే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా 68.52 విజయాలు, 148 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా (60.29 విజయాలు, 123 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది డబ్ల్యూటిసి ఫైనల్ జూన్‌లో ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియంలో జరగనుంది.
శ్రీలంక డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరాలంటే..
శ్రీలంక జట్టు డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరాలంటే త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో గెలుపొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీలంక 53.33 శాతం విజయాలు, 64 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.










